-->
Petrol Diesel Price: పండగ వేల తప్పని పెట్రోల్ మంటలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరలు ఇలా..

Petrol Diesel Price: పండగ వేల తప్పని పెట్రోల్ మంటలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరలు ఇలా..

Petrol Diesel Prices

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగు ఆగడం లేదు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.37గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 102.42గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.70గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.102.72గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.51గా ఉండగా.. డీజిల్ ధర రూ. 102.53గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.82గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.37 ఉండగా.. డీజిల్ ధర రూ.102.42గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.09పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.15గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.04 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.44 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.99 ఉండగా.. డీజిల్ ధర రూ. 103.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.88 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.33గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.69గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.14గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 112.04 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.104.44లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 105.14 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.78 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.105.76 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.88 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.50 ఉండగా.. డీజిల్ ధర రూ.98.36గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.108.80పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.99.63గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.

ఇవి కూడా చదవండి: RK: పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. పార్టీ నుంచి సమాచారం రాలేదు.. కుటుంబ సభ్యుల కామెంట్..

Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FYBMQ2

0 Response to "Petrol Diesel Price: పండగ వేల తప్పని పెట్రోల్ మంటలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరలు ఇలా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel