-->
8 బంతుల్లో సినిమా చూపించాడు.. 23 బంతుల్లో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.. భయంకర బ్యాట్స్‌మెన్‌..?

8 బంతుల్లో సినిమా చూపించాడు.. 23 బంతుల్లో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.. భయంకర బ్యాట్స్‌మెన్‌..?

Liam Livingstone

T10 League: T10 లీగ్ మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్లు దుమ్ము రేపుతున్నారు. ఒక్కోసారి క్రిస్ గేల్, మరికొన్ని సార్లు ఆండ్రీ రస్సెల్ తుఫాను సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టన్ పేరు కూడా చేరింది. గేల్, లివింగ్స్టన్ ఇద్దరు అబుదాబి జట్టులో సభ్యులు. లివింగ్‌స్టన్ అబుదాబి జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు శనివారం సాయంత్రం నార్తర్న్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ తుఫాను సృష్టించాడు. కష్ట సమయాల్లో లియామ్ లివింగ్‌స్టన్ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

10 ఓవర్ల మ్యాచ్‌లో ఆరో ఓవర్ వరకు జట్టు స్కోరు 55 పరుగులు మాత్రమే. అప్పటికే గేల్ వికెట్‌తో సహా 4 పెద్ద వికెట్లు కూడా పడిపోయాయి. కానీ ఆ తర్వాత లివింగ్‌స్టన్ గేర్ మార్చాడు. తన జట్టు కోసం 23 బంతుల్లోనే విజయానికి కావాల్సిన బాటలు వేశాడు. నార్తర్న్ వారియర్స్‌పై లియామ్ లివింగ్‌స్టన్ 23 బంతుల్లో 295.65 స్ట్రైక్ రేట్‌తో 2 ఫోర్లు, 8 సిక్సర్‌లతో 68 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను ఆడాడు. అంటే అతను తన ఇన్నింగ్స్‌లో కేవలం10 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అందులో 8 సిక్సర్ల ద్వారా 48 పరుగులు వచ్చాయి.

ఈ 8 సిక్సర్లలో 6 సిక్సర్లు లివింగ్ స్టన్ చివరి 2 ఓవర్లలో కొట్టినవే. 9వ ఓవర్లో తొలుత 2 ఫోర్లు, ఆ తర్వాత 4 సిక్సర్లు బాదాడు. దీంతో 10వ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదాడు. లివింగ్‌స్టన్‌ ధాటికి అబుదాబి జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. అనంతరం నార్తర్న్ వారియర్స్ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ జట్టు కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 19 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగులు చేసినా మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించలేదు. 2 మ్యాచ్‌ల్లో అబుదాబి జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చింతించకండి ఇకనుంచి ఆ సేవలు యధావిధిగా ప్రారంభం..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oLxBPC

Related Posts

0 Response to "8 బంతుల్లో సినిమా చూపించాడు.. 23 బంతుల్లో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.. భయంకర బ్యాట్స్‌మెన్‌..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel