-->
Hansika Motwani: హన్సిక ప్రధాన పాత్రలో మై నేమ్ ఈజ్ శృతి.. ఊహించని మలుపులతో ఉండబోతున్న మూవీ..

Hansika Motwani: హన్సిక ప్రధాన పాత్రలో మై నేమ్ ఈజ్ శృతి.. ఊహించని మలుపులతో ఉండబోతున్న మూవీ..

Hansika

ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ వుంటుందని చెబుతుంటారు. అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు వుంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమే మై నేమ్ ఈజ్ శృతి అంటున్నారు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక హాన్సిక టైటిల్ పాత్రను పోషిస్తుంది. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 85శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా వుండే కథాంశంతో, సర్‌ప్రైజింగ్‌గా వుంటే ట్విస్ట్‌లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాన్సిక పాత్ర ఎంతో వైవిధ్యంగా వుంటుందని తెలుస్తుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతి పాత్రలో హన్సిక కనిపించనుంది.

సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ…ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ..  ఇప్పటి వరకు హైదరాబాద్, వైజాగ్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. బ్యాలెన్స్ పార్ట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. నిర్మాతలుగా ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు ఎంతో క్లారిటీతో, పూర్తి ప్రణాళికతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అన్నారు. అతనికి కమర్షియల్ దర్శకుడిగా మంచి భవిష్యత్ వుంది అన్నారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు నిర్మాతలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YSDzVL

0 Response to "Hansika Motwani: హన్సిక ప్రధాన పాత్రలో మై నేమ్ ఈజ్ శృతి.. ఊహించని మలుపులతో ఉండబోతున్న మూవీ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel