-->
Mahesh Babu: లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో కనిపించనున్న మహేష్..?

Mahesh Babu: లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో కనిపించనున్న మహేష్..?

Mahesh

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత మహర్షి సినిమాతో తన లుక్ చేంజ్ చేశారు. ఎప్పుడు కూల్ అండ్ కామ్ లుక్‌లో కనిపించే మహేష్ మహర్షి సినిమాలో కాస్త రఫ్‌గా గడ్డంతో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో సూపర్ స్టైలిష్ లుక్‌కు మారి అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇక సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వంలో వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో మొదటి సారి మహానటి మహేష్ సరసన నటిస్తుంది. ఇక కీర్తి సురేష్ మహేష్ బాబు కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేయడానికి షూటింగ్‌లో స్పీడ్ పెంచారు యూనిట్. ఈ క్రమంలోనే ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో ఉండనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే దుబాయ్‌‌‌లో భారీ ఛేజింగ్ సీన్, గోవాలో అదిరిపోయే ఫైట్ సీన్ షూట్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. సర్కారు వారి పాట సినిమాలో ఒక సీన్‌లో మహేష్ లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో కనిపించనున్నారట. ఇంటర్వెల్‌కు ముందు జరిగే ఫైట్ సమయంలో మహేష్ ఇలా లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో విలన్‌లకు కనిపిస్తారని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ అలాగే పాటలు అన్ని కలిపి సర్కారు వారి పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: నామినేషన్ ప్రక్రియలో సరికొత్త రికార్డ్.. షణ్ముఖ్‌కే దక్కిన ఘనత..

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు

Shraddha Srinath: టాలెంటెడ్ హీరోయిన్ స్టైలిష్ ఫొటోస్.. ‘శ్రద్ధా శ్రీనాథ్‌’ వయ్యారాలపై ఓ లుక్కేయండి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2WFaZpV

Related Posts

0 Response to "Mahesh Babu: లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో కనిపించనున్న మహేష్..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel