-->
Krishna-Sitara: ఇద్దరు తాతయ్యలతో ముద్దుల తనయ ప్రిన్స్ ‘సితార’ పిక్ వైరల్ ..

Krishna-Sitara: ఇద్దరు తాతయ్యలతో ముద్దుల తనయ ప్రిన్స్ ‘సితార’ పిక్ వైరల్ ..

Sitara Krishna

Krishna-Sitara: టాలీవుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నమ్రత దంపతుల ముద్దుల తనయుడు గౌతమ్, తనయ సితార ఫ్యామిలీ పిక్స్ ఎప్పుడూ అందరిని అలరిస్తూనే ఉంటాయి. మహేష్ కూతురు సితార అయితే సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి సెలబ్రేటీనే.. ఒకే ఇంట్లో ఉండకపోయినా సితార, గౌతమ్ లకు తమ తాతయ్య కృష్ణల మధ్య మంచి బాండింగ్  ఉంది. తరచుగా తాతయ్యతో కృష్ణను కలిసి సందడి చేస్తుంటారు.

కృష్ణ ఇంట్లో ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఫ్యాన్స్ తో తమ సంతోషాన్ని పంచుకుంటారు. తాజాగా మహేష్ కూతురు సితార ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో మహేష్ బాబు ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

సితార తన తాతయ్య కృష్ణతో పాటు.. ఇద్దరు తాతలతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. సితార కృష్ణ తో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది..   తాతగారితో కలిసి భోజనం చేయడం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అత్యత్తమ తాత అని ఆ ఫోటోకి ఓ కామెంట్ కూడా జత చేసింది.  మరొక ఫోటోలో సితార .. తాతయ్య కృష్ణ, సోదరుడు ఆదిశేషగిరిరావుతో దిగిన ఫోటోనూ షేర్ చేసింది. తాతయ్యను, చిన తాతయ్య అంటే తనకు ఎంతో అభిమానం అని తెలిపింది.  ప్రస్తుతం మహేష్ బాబు కు ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Also Read:  ఈరోజు సీఎం జగన్ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన పార్టీ శ్రేణులు..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3miNjBd

Related Posts

0 Response to "Krishna-Sitara: ఇద్దరు తాతయ్యలతో ముద్దుల తనయ ప్రిన్స్ ‘సితార’ పిక్ వైరల్ .."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel