-->
Bigg Boss 5 Telugu: కూర్చుని కబుర్లు చెబుతున్నావ్ .. సిరి-షణ్ముఖ్ జోడిపై నాగ్ అసహనం..

Bigg Boss 5 Telugu: కూర్చుని కబుర్లు చెబుతున్నావ్ .. సిరి-షణ్ముఖ్ జోడిపై నాగ్ అసహనం..

Shanmukh

సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షన్నూ చేసే వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువగా హిట్ అవుతుంటాయి. అలాగే.. సిరికి సైతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. వీరిద్దరూ ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నారు. అయితే ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి కథ మారిపోయింది. షణ్ముఖ్, సిరి కలిసే ఉండడం.. అస్సలు కెమెరాకు కనిపించకుండా తిరగడం.. గేమ్ పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా.. కేవలం కూర్చోని సోది చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఇప్పటికే నాగ్ సైతం కాస్త గేమ్ ఆడు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా షణ్ముఖ్‏లో ఏ మాత్రం మార్పు లేదు. కానీ ఈ వారం షన్నూలో కాస్త మార్పు కనిపించిందనుకోవాలి.. సిరిని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనతో మాట్లాడం ఇష్టం లేదని ముఖంమీదనే చెప్పేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.

నిన్నటి ఎపిసోడ్‏లో తనను షణ్ముఖ్ మళ్లీ దూరం పెడుతున్నాడని తెగ ఏడ్చేసింది సిరి. జెస్సీతో బానే ఉండి… తనకు స్పేస్ ఇవ్వకపోవడంతో మండిపోతుంది అని కాజల్ దగ్గర చెప్పుకొచ్చింది. దీంతో రెచ్చిపోయిన కాజల్.. కడిగెయ్.. నిలదిసేయ్ అంటూ మరింత రెచ్చగట్టింది. నాకు స్పేస్ కావాలి.. చిరాకుగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇందుకు అనుగుణంగా.. తనదైన శైలిలో కాజల్ రెచ్చిగొట్టింది. రాత్రి కూడా అదే అడిగాను.. కోపం వచ్చేస్తుంది. అందుకే ఈ కనెక్షన్స్, ఫ్రెండ్ షిప్స్ ఉండకూడదు. నేను ఏదైతే వద్దనుకున్నానో అదే జరిగింది అంటూ ఫీల్ అయ్యింది. ఇక ఆ తర్వాత షణ్ముఖ్ బయటకు వచ్చి సిరితో మాట్లాడకుండా వెళ్లిపోయాడు. సిరి పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో.. కాజల్ దగ్గర ఏడ్చేసింది సిరి. ఇక ఆతర్వాత డబుల్ హార్ట్స్ మినపగుళ్లు వారు ఇచ్చిన టాస్క్ అప్పుడు సైతం షణ్ముఖ్ పక్కనే కూర్చుంది సిరి. ఎందుకు దూరం పెడుతున్నావ్ అంటూ ప్రశ్నించగా.. మెంటల్లీ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. నన్ను వాడుకుంటున్నారన్న ఫీలింగ్ వస్తోంది. జెస్తీతో ఉన్న బాండింగ్ వేరు.. కాబట్టి వాడు నన్ను వాడుకున్నా.. నాకు ఆ ఫీలింగ్ రాదు.. కానీ నీ విషయంలో అలా కాదు.. అని ముఖం మీదే చెప్పేశాడు షణ్ముఖ్. నిన్ను వాడుకుంటున్నారు అనుకోవడం నీ అభిప్రాయం. తప్పు అనడం లేు.. నేను నీ దగ్గరుంటే గేమ్ పై ప్రెజర్ పడుతుందని ఫీలవుతున్నావ్ అంతేగా.. ఈ ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ ఉంది.. కానీ చెప్పను… టై వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు అంటూ చెప్పుకొచ్చింది సిరి.

ఇక ఆ తర్వాత.. ఎంట్రీ ఇచ్చిన నాగ్.. రావడంతోనే జెస్సీపై జాలిపడ్డాడు.. అనంతరం.. షణ్ముఖ్, సిరికి ఘాటు పచ్చిమిర్చిని పంపి తినమని చెప్పాడు. కూర్చుని కబుర్లు చెప్తున్నాడని.. అతడిలోని ఫైర్ బయటకు తీసుకురావడానికి మిర్చి తినమని చెప్పాడు. ఆ తర్వాత.. నీ ఆట నువ్వు ఆడు అంటూ సిరికి వార్నింగ్ ఇచ్చాడు. వీరిద్దరి వలన జెస్సీ సఫర్ అవుతున్నాడని తెలిపాడు నాగ్.

Also Read: Bigg Boss 5 Telugu: నా వరకు నేను కరెక్ట్.. బరాబర్ చేశా.. లోబోను కడిగిపారేసిన నాగ్..

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‏ను జంతువులతో పోలుస్తున్న నటరాజ్ మాస్టర్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3B8ZLsI

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: కూర్చుని కబుర్లు చెబుతున్నావ్ .. సిరి-షణ్ముఖ్ జోడిపై నాగ్ అసహనం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel