
Viral Video: వామ్మో.. రెండు ముక్కలైనా ఆగని లారీ.. రోడ్డుపై పరుగులు తీసింది.. వీడియో వైరల్

Truck parts continue to roll on road: సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని భయంకరంగా కూడా ఉంటాయి. తాజాగా ఓ లారీకి చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదానికి గురై లారీ రెండు ముక్కలైనప్పటికీ.. లారీ ఇంజన్ భాగం ఆగకుండా ముందుకు వెళ్లిపోతుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు బురద రోడ్డు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ రోడ్డులోనే వారి వెనకవైపు నుంచి భారీ లోడ్‌తో వస్తున్న లారీ మూలమలుపు వద్ద టర్న్ అయ్యింది.
రోడ్డు బురదగా ఉండటం.. ఆపై ఒక్క సారిగా లారీ టర్న్ కావడంతో అదుపు తప్పి కింద పడిపోయింది. అయితే లారీ పైభాగం మొత్తం పడిపోయినా.. చక్రాలతో ఉన్న కింది భాగం రోడ్డుపై పరుగులు పెడుతూ దూసుకెళ్లింది. కాగా.. అదృష్టవాత్తూ.. లారీలో నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన అనంతరం.. డ్రైవర్ కూడా భయంతో పరుగులు తీశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేదీ స్పష్టంగా తెలియరాలేదు. కానీ ఈ 14 సెకండ్ల వీడియోలో బురద రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
వైరల్ వీడియో..
शरीर का त्याग करके आत्मा निकल गई #FunKiBaat pic.twitter.com/Iry5vmQNRc
— Ashok Kumar ◆ (@ashokism) September 13, 2021
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను చూసి కొంత మంది ఫన్నీగా స్పందిస్తే.. మరికొందరు తృటిలో పెను ప్రమాదం తప్పిందంటూ కామెంట్లు చేస్తున్నారు. భారీ లోడ్ కారణంగా లారీ రెండుగా చీలిపోయిందని.. అక్కడ ఎవరైనా ఉంటే పెద్ద ప్రమాదం వాటిల్లేదని పేర్కొంటున్నారు.
Also Read:
JEE Main 2021 Result: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. మొదటి ర్యాంకులతో మెరిసిన తెలుగు విద్యార్థులు..
Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం క్రియేటివిటీరా బాబు. బైక్‌ను కారుగా మార్చిన తీరు చూస్తే..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CfO1Vp
0 Response to "Viral Video: వామ్మో.. రెండు ముక్కలైనా ఆగని లారీ.. రోడ్డుపై పరుగులు తీసింది.. వీడియో వైరల్"
Post a Comment