-->
Crime News: స్నేహితుడి ప్రియురాలిపై క‌న్నేసి.. ఫ్రెండ్‌నే దారుణంగా చంపాడు.. తీరా తాగి..

Crime News: స్నేహితుడి ప్రియురాలిపై క‌న్నేసి.. ఫ్రెండ్‌నే దారుణంగా చంపాడు.. తీరా తాగి..

Murder

Man murders friend: స్నేహితుడి ప్రియురాలిపైనే ఓ యువకుడు కన్నేశాడు.. తీరా ఈ విషయం స్నేహితుడికి తెలయడంతో.. అతన్ని దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. యూపీలోని మీరట్‌ నుంచి ఆరు నెల‌ల కింద‌ట అదృశ్యమైన ఓ వ్యక్తి మిస్టరీని పోలీసులు తాజాగా చేధించారు. నిందితుడు తాగి పక్కింటి వారితో గొడవపడటంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని హ‌త్య చేసి మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేశాడ‌ని.. మీకు అదే గతి పడుతుందని పేర్కొనడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో నిందితుడితో పాటు అత‌డి భార్యను అరెస్ట్ చేసినట్లు మీరట్‌ పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మీర‌ట్ జిల్లా కిధోర్ పట్టణానికి చెందిన‌ న‌సీం గ‌ర్‌ముక్తేశ్వర్‌లో హీనా అనే యువ‌తితో గత కొంతకాలంగా స‌హ‌జీవ‌నం చేస్తూ ఓ ఇంట్లో నివ‌సిస్తున్నాడు. ఈ క్రమంలో న‌సీం స్నేహితుడు డానిష్ తరచూ అక్కడికి వస్తుండేవాడు. ఈ క్రమంలో నసీం ప్రియురాలు హీనాపై డానిష్‌ కన్నేశాడు. అతను లేని క్రమంలో ఇంటికి వస్తుండటంతో.. వారిద్దరి వ్యవహారం గురించి నసీంకు తెలిసింది. దీంతో డానిష్‌, హీనాను మంద‌లించాడు. దీంతో కోపం పెంచుకున్న డానిష్‌.. నసీం అడ్డు తొల‌గించుకోవాల‌నుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 17న అత‌డిని చంపి అమ్రోహ జిల్లాలోని ఓ కాలువ‌లో ప‌డేశాడు. మ‌రుస‌టి రోజే న‌సీం మృత‌దేహం లభ్యమైనప్పటికీ.. పోలీసులు చనిపోయిన వ్యక్తిని గుర్తించ‌లేక‌పోయారు. దీంతో మృతదేహాన్ని ద‌హ‌నం చేశారు. అనంతరం కొద్దిరోజుల‌ తర్వాత డానిష్ హీనాను వివాహం చేసుకుని అదే ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు.

ఈ క్రమంలో డానిష్‌కు.. పొరుగింటి మ‌హిళ‌తో గొడవ జరిగింది. తాగిన మైకంలో ఉన్న డానిష్.. న‌సీంను తానే హ‌త్య చేశాన‌ని, ఇంకా ఎన్నో నేరాలు చేశాన‌ని.. త‌న‌తో పెట్టుకుంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయంటూ హెచ్చరించాడు. దీంతో ఈ హ‌త్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విష‌యాన్ని మహిళ న‌సీం త‌ల్లితండ్రుల‌కు చెప్పడంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల విచారణలో.. న‌సీంను తానే హ‌త్య చేసి కాల‌వ‌లో ప‌డేశాన‌ని డానిష్ అంగీక‌రించాడు. ఈ మేరకు డానిష్‌, అతడి భార్య హీనాను అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Hyderabad: పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి.. సీటీలో మరో ఘటన

KTR: సైదాబాద్ నిందితుడు దొరకలేదు.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/395GY5p

Related Posts

0 Response to "Crime News: స్నేహితుడి ప్రియురాలిపై క‌న్నేసి.. ఫ్రెండ్‌నే దారుణంగా చంపాడు.. తీరా తాగి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel