-->
Sim Fraud: రూ.11 రీచార్జ్‌ చేసినందుకు బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.6 లక్షలు మయం.. మోసగాడి వలలో సీనియర్‌ సిటిజన్‌

Sim Fraud: రూ.11 రీచార్జ్‌ చేసినందుకు బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.6 లక్షలు మయం.. మోసగాడి వలలో సీనియర్‌ సిటిజన్‌

Phone Call

Sim Fraud: మొబైల్‌ ఫోన్‌ వాడేవారికి హెచ్చరిక. ఇలాంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతమున్న రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. అప్రమత్తంగా లేకుంటే మోసపోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మోసగాళ్లు చాలా సులభంగానే అకౌంట్‌లో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఫోన్‌ కాల్‌, మెసేజ్‌ల రూపంలో లింక్‌లను కస్టమర్లకు పంపిస్తూ క్షణాల్లో దోచుకుంటున్నారు. ఇప్పుడు మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహరాష్ట్రలోని థాణేలో జరిగింది. ఒక సీనియర్ సిటిజన్ ఫోన్‌కు మోసగాడు కాల్ చేశాడు. టెలికం కంపెనీ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు. మీ సిమ్ కార్డు రేపటిలోగా బ్లాక్ అవుతుందని, ఇక పని చేయదని, వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరాడు.

దీనికి ఆయన రేపు టెలికం ఔట్‌లెట్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకుంటానని చెప్పాడు. అయితే మోసగాడు మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదని, ఒక లింక్ పంపిస్తానని, దానిపై క్లిక్ చేసి రూ.11 రీచార్జ్ చేసుకుంటే సరిపోతుందని, సిమ్ పని చేస్తుందని మాయ మాటలతో నమ్మబలికాడు. ఇందుకు ఆ పెద్దాయన సరేనన్నాడు.

ఇక మోసగాడు మొదట ఒక లింక్ పంపించాడు. కానీ అది పని చేయలేదు. తర్వాత మరో లింక్ పంపించాడు. దీనిపై క్లిక్ చేసిన పెద్దాయన అకౌంట్ నుంచి రూ.6 లక్షలు కట్ అయ్యాయి. లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ మోసగాడి కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. దీంతో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. సీనియర్‌ సిటిజన్‌ జరిగిన మోసాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా, ఇలాంటి మోసాలు దేశంలో చాలా జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆర్బీఐ, బ్యాంకు అధికారులు, పోలీసులు సోషల్‌ మీడియా ద్వారా ఎన్నో రకాల హెచ్చరికలను జారీ చేస్తున్నారు. మోసగాళ్ల వలలో పడి నష్టపోకూడదని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. బ్యాంకు నుంచి, టెలికాం కంపెనీల నుంచి అంటూ వివిధ రకాల లింక్‌లను పంపిస్తూ కస్టమర్లను నిలువునా దోచుకుంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

IRCTC: లోయర్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుందని చెప్పడానికి వీలుండదు.. రైల్వే ప్రయాణికులకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ..!

WhatsApp Payments Service: భారత్‌లో అందరికి అందుబాటుకి వచ్చిన వాట్సాప్‌ పేమెంట్ సర్వీస్‌.. ఎలా చేయాలంటే..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XnTVFe

0 Response to "Sim Fraud: రూ.11 రీచార్జ్‌ చేసినందుకు బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.6 లక్షలు మయం.. మోసగాడి వలలో సీనియర్‌ సిటిజన్‌"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel