
Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver Price Today: దేశంలో ప్రతిరోజు బంగారం, వెండి కొనుగోళ్లు మాత్రం ఆగవు. కోట్లల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఇక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. తాజాగా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.59,900 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.69,000 ఉంది. అలాగే తమిళనాడు చెన్నైలో కిలో వెండి ధర రూ.64,100 ఉండగా, కోల్‌కతాలో రూ.59,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.59,900 ఉండగా, కేరళలో రూ.64,100 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.59,900 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,100 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.64,100 ఉండగా, విశాఖపట్నంలో రూ.64,100 ఉంది.
అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు. కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read:
Gold price today: గుడ్‌న్యూస్.. స్థిరంగానే పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Bharat Bandh Live: నేడు భారత్ బంద్.. దేశవ్యాప్త ప్రతిష్టంభన, నిరసనలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3obLTu3
0 Response to "Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?"
Post a Comment