-->
Bigg Boss 5 Telugu: లహరి ఔట్.. ఆ కంటెస్టెంట్‏కు వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ.. జాగ్రత్త అంటూ చురకలు..

Bigg Boss 5 Telugu: లహరి ఔట్.. ఆ కంటెస్టెంట్‏కు వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ.. జాగ్రత్త అంటూ చురకలు..

Lahari

బిగ్‏బాస్ మూడవ వారం ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. శనివారం ఫుల్ సీరియస్‏గా ఒక్కొక్కరికి వార్నింగ్ నాగ్.. ఇక సండే ఫన్ డే అంటూ సందడి చేశారు. ఇంటి సభ్యులతో అంత్యాక్షరి ఆడించగా.. డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. ఇక ఆ తర్వాత అంతా అనుకున్నట్టే ఈవారం ఇంటి నుంచి లహరి బయటకు వచ్చేసింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన లహరి.. ఇంట్లోని ఒక్కో సభ్యులకు వార్నింగ్స్ ఇస్తూ వెళ్లింది. అంతేకాకుండా.. సోమవారం నామినేషన్స్ నుంచి కొనసాగుతున్న రచ్చను మరోసారి లేవనెత్తింది. అలాగే .. ఆట తీరులో మార్పు తెచ్చుకోవాలని షణ్ముఖ్‏ను హెచ్చరించింది. మరి నిన్న (సెప్టెంబర్ 26) ఎపిసోడ్‏లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

అక్కినేని అఖిల్ నటిస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలోని లెహరాయి లెహరాయి పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఇక రావడంతోనే దేవతలా కనిపిస్తున్నావ్ అంటూ హమీద పై ప్రశంసలు కురిపించాడు. దీంతో కొత్తది ఏదైనా చెప్పు అంటూ పంచులు వేసింది హమీద. దీంతో వెంటనే నాగ్.. ఎంతో హాట్‏గా ఉన్నావ్ అంటూ కౌంటర్ వేశాడు. ఇక ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీసి.. అంత్యాక్షరీ ఆడించాడు. అలాగే ఆ పాటలకు సభ్యులతో స్టెప్పులేయించాడు నాగ్. అలాగే ఇంటి సభ్యులతో మరో గేమ్ ఆడించాడు కింగ్. ఇక ఆఖరున డేంజర్ జోన్‏లో ఉన్న ప్రియ, లహరిలను నిల్చోమని.. ఇంటి సభ్యులను టెన్షన్ పెడుతూ.. చివరకు లహరి ఎలిమినేట్ అని ప్రకటించాడు నాగ్. బయటకు వచ్చిన లహరి.. ముందుగా శ్రీరామ చంద్రను తనకోసం పాట పాడమని కోరింది. ఎటో వెళ్లిపోయింది మనసు అని శ్రీరామ్ పాడగా.. లహరి ఎమోషనల్ అయ్యింది.

అలాగే ఇంట్లో ఉన్న ఫెయిల్యూర్ కంటెస్టెంట్స్ ఎవరనేది చెప్పాలని లహరిని అడగ్గా అందరి గురించి చెబుతాను అంటూ చెప్పేసింది. ఇక అందులో భాగంగా ఒక్కోక్కరి గురించి చెప్పుకొచ్చిన తర్వాత… రవి వద్దకు వచ్చేసరికి.. మరోసారి తన గురించి ప్రియతో మాట్లాడిన మాటలను లెవనెత్తింది. అంతేకాకుండా.. చుట్టూ కెమెరాలున్నాయని.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రవిని హెచ్చరించింది. అలాగే కాజల్ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక ఆ తర్వాత మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించండి అంటూ ప్రియకు సలహాలు ఇచ్చింది. మిగతా వారికే కాకుండా.. నీ గురించి కూడా నువ్వు టైం ఉంచుకో అంటూ శ్రీరామచంద్రకు సూచించింది.

Also Read: Bigg Boss 5 Telugu: ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వెళ్లిన లహరి..

Varsha Bollamma : తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటున్న వయ్యారాల వర్ష..

Bharat Bandh Live: నేడు భారత్ బంద్.. దేశవ్యాప్త ప్రతిష్టంభన, నిరసనలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/39HBMoG

Related Posts

0 Response to "Bigg Boss 5 Telugu: లహరి ఔట్.. ఆ కంటెస్టెంట్‏కు వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ.. జాగ్రత్త అంటూ చురకలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel