-->
Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..

Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..

Love Marriage With Pubji Ga

కర్నూలుజిల్లా అబ్బాయి.. కృష్ణాజిల్లా అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది. ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్న ఘటన కర్నూలుజిల్లా ఆదోనిలో జరిగింది. ఆదోని మండలం ఢాణాపురం గ్రామానికి చెందిన యువకుడు పబ్జీగేమ్‌కు బానిసయ్యాడు. ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో పబ్జీగేమ్‌ ఆడుతూ బిజీగా ఉండేవాడు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ చదివే యువతితో స్నేహం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఒకరినొకరు సెల్‌ఫోన్‌ నంబర్లు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత గంటల తరబడి ఆన్‌లైన్లో ఛాటింగ్‌ చేసేవారు. ఆ వ్యవహారం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువైపుల పెద్దలకు ఎవ్వరికీ చెప్పకుండా మూడు రోజుల క్రితం ఈ ప్రేమికులు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

వివాహం చేసుకొని అబ్బాయి సొంతూరు ఢాణాపురం వచ్చారు. అయితే తమ కూతురు కనిపించడంలేదని యువతి తల్లిదండ్రులు కృష్ణాజిల్లా కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఆదోని మండలం ఢాణాపురంలో ఉన్నట్లు గుర్తించారు. ఆదోని పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు అందించారు.

దాంతో ఎస్‌ఐ విజయలక్ష్మి.. సిబ్బందితో కలిసి ఢాణాపురం వెళ్లారు. అక్కడున్న ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే ఇద్దరు మేజర్లేనని తేలింది. పబ్జీగేమ్‌ తమను కలిపింది చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. యువతి మిస్సింగ్‌ కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా ప్రేమికులిద్దరిని కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులకు అప్పజెప్పామని ఎస్‌ఐ విజయలక్ష్మి చెప్పారు.

అయితే.. సీన్‌ కంకిపాడుకు మారడంతో.. యువతి, యువకుల ప్రేమను పెద్దలు ఒప్పుకుంటారా..? పోలీసులు డెసిషన్‌ ఎలా ఉంటుందనేది..ప్రస్తుతానికి సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి: Gulab Cyclone Live Updates: గులాబ్ సైక్లోన్ లైవ్ అప్డేట్స్: తీరం దాటిన గులాబ్‌ తుఫాను.. నేడు, రేపు భారీ వర్ష సూచన

PM Modi: ప్రధాని మోడీ అలుపెరుగని అమెరికా పర్యటన.. 65 గంటలు.. 20 సమావేశాలు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3i6TPcw

Related Posts

0 Response to "Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel