-->
NEET UG 2021: ఇవాళ దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. పూర్తి వివరాలు మీకోసం..

NEET UG 2021: ఇవాళ దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. పూర్తి వివరాలు మీకోసం..

NEET UG 2021: మెడికల్ కళాశాలలో ప్రవేశాల కోసం జరిగే నీట్(యూజీ) ఎగ్జామ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన ఆఫ్‌లైన్‌లో జరుగనున్న నీట్‌ ఎగ్జామ్ కు దాదాపు 16 లక్షల మంది పోటీపడుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే నీట్ మూడు గంటల పాటు జరగనుంది. గత ఏడాది 15.97 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకోగా 13 లక్షల మంది పరీక్ష రాశారు. ఈసారి దేశవ్యాప్తంగా 202 నగరాల్లో మొత్తం 3,842 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొత్తం 112 కేంద్రాల్లో నీట్‌ జరుగనుండగా.. ఏపీలో 151 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. థర్మల్‌ స్ర్కీనింగ్‌ తర్వాత విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. అలాగే.. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుందని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కఠిన నిబంధనలు విధించింది.

ఇదిలాఉంటే.. ఈసారి నీట్ లో స్వల్ప మార్పులు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇద్దరికి ఒకే మార్కులు వస్తే, నెగెటివ్‌ మార్కులు తక్కువగా వచ్చిన వారికి ముందు ర్యాంకు ఇవ్వనుంది. ఈ సారి నీట్ ఎగ్జామ్‌లో ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నలు అదనంగా ఇవ్వనున్నారు. గతంలో మొత్తం 180 ప్రశ్నలిచ్చేవారు. అన్నిటికీ సమాధానాలు రాయాల్సి ఉండేది. కానీ, ఈసారి ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నల చొప్పున కలిపారు. ఒక్కో సబ్జెక్టులో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలిస్తారు. వాటిలో జవాబులు రాయాల్సింది. 180 ప్రశ్నలకు మాత్రమే. సమయం మూడు గంటలే ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు ‘ఎ’ సెక్షన్‌లో 35 ప్రశ్నలుంటాయి. అన్నీ రాయాలి. ‘బి’ సెక్షన్‌లోని 15 ప్రశ్నల్లో 10 రాయాలి.

వృక్ష, జంతుశాస్త్రాల్లో జ్ఞాపకశక్తి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలు 60 శాతానికి పైగా ఉంటాయి. డయాగ్రామ్స్ ఆధారంగా ఇచ్చే అంశాలు.. కణ విభజన (సెల్‌ డివిజన్‌), వాటి దశలు, ఫ్లో ఛార్టులు, మొక్కల్లో చీడలు, క్రిమికీటకాల వంటివి గుర్తుపెట్టుకోవాలి. ఈసారి 20 ప్రశ్నల మేరకు వెసులుబాటు కల్పించారు. కానీ ఇందులో సరిగ్గా అంచనా వేయకపోతే విద్యార్థులు నష్టపోతారు. ఎందుకంటే 3 గంటల్లోనే 200 ప్రశ్నలూ చదవాలి. అదనపు ప్రశ్నలు చదివితే తప్ప.. వేటిని ఎంచుకోవాలనే స్పష్టత రాదు. ఇది విద్యార్థులకు సవాలే. మరింత చురుగ్గా ఆలోచించాలి. ముందు నుంచే సాధన అవసరం. మోడల్‌ ఓఎంఆర్‌ షీట్‌ను ఎన్‌టీఏ ఆన్‌లైన్‌లో ఉంచింది. దీనిని సాధన చేసిన విద్యార్థులు ఈసారి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది.

నీట్‌లో ర్యాంకును నిర్ణయించేది భౌతికశాస్త్రమే. ఎక్కువ మంది కష్టంగా భావించేదీ కూడా ఈ భౌతిక శాస్త్రాన్నే. ఇంటర్‌ సెకండ్ ఇయర్ సిలబస్‌ కొంత సులభంగా ఉంటుంది. అందులో ఎక్కువ స్కోర్‌కు అవకాశం ఉంది. ఆధునిక భౌతికశాస్త్రం (మోడర్న్‌ ఫిజిక్స్‌), ఆప్టిక్స్‌లో ఎక్కువ స్కోర్‌ చేయవచ్చు. కష్టమైన రొటేషనల్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌ లాంటి అంశాల పై పూర్తి పట్టు ఉంటే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఆర్డర్స్‌ సంబంధిత అంశాలు, ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఫార్ములేషన్లు, యూనిట్లు, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నేమ్డ్‌ రియాక్షన్లు, రీఏజెంట్లను రివిజన్‌ చేసుకోవాలి. సంబంధిత గ్రాఫ్స్‌ (పట్టిక) పరిశీలించాలి. తప్పు, ఒప్పు తరహా ప్రశ్నల్లో గందరగోళం పడకుండా, వాటిని బాగా అర్థ చేసుకోవాలి.

Also read:

Oil Prices Down: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. దిగుమతి పన్ను తగ్గించిన కేంద్రం.. దిగి వస్తున్న వంటనూనే ధరలు

Lokesh: బంధువులకు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారింది : నారా లోకేష్

Lady Finger Curry: బెండకాయ కూరతో భోజనం చేశాక ఈ రెండు పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్‌



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Xfx52F

Related Posts

0 Response to "NEET UG 2021: ఇవాళ దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. పూర్తి వివరాలు మీకోసం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel