-->
Face Mask: కొబ్బరి చిప్పతో మాస్క్.. అదేమంటే విజిల్ కోసమట.. చివరికి పోలీసుల కంటపడటంతో..

Face Mask: కొబ్బరి చిప్పతో మాస్క్.. అదేమంటే విజిల్ కోసమట.. చివరికి పోలీసుల కంటపడటంతో..

Mask

Face Mask: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ విజృంభిస్తోంది. ఈ కారణంగానే ప్రతీ ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించడం అలవాటు చేసుకున్నారు. కొందరు వ్యక్తులు అయితే సరికొత్త ప్రయోగాలకు తెరలేపుతున్నారు. రక్షణ కోసం ధరించే ఫేస్‌మాస్క్‌‌ను చిత్ర విచిత్ర రూపాల్లో తయారు చేసి.. జనాలను షాక్‌కు గురి చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి మాస్క్‌నే తయారు చేశాడు. అది ఇప్పుడు నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. వాస్తవానికి ఈ మాస్క్‌ను ఏ వస్త్రంతోనో చేస్తే పెద్దగా సమస్య ఉండేది కాదు.. కానీ, ఈ వ్యక్తి దానిని కొబ్బరి చిప్పతో తయారు చేశాడు. ఈ కొబ్బరి చిప్ప మాస్క్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండోనేషియాకు చెందిన నంగా బుడియాసా.. ఒక పార్కింగ్ స్థలంలో పనిచేస్తున్నాడు. అయితే, పార్కింగ్ స్థలంలో నంగా ఎప్పుడూ విజిల్ వేయాల్సి ఉంటుంది. దాని కోసం అతను మళ్లీ మళ్లీ మాస్క్ తీయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే నంగా మెదడుకు ఓ సరికొత్త ఆలోచన తట్టింది. వెంటనే కొబ్బరి చిప్పతో ప్రయోగానికి తెరలేపాడు. సరికొత్త మాస్క్‌ని సృష్టించాడు. కొబ్బరి చిప్పకు రెండు చివరలా చెవులకు తాకించేలా రబ్బరు దారాలను ఏర్పాటు చేశాడు. అలాగే కొబ్బరి చిప్పకు చిన్న రంద్రం చేసి, దానికి విజిల్‌ను ఫిక్స్ చేశాడు. తద్వారా విజిల్ వేసేందుకు మళ్లీ మళ్లీ ముసుగు తీయాల్సిన పనిలేదంటున్నాడు నంగా. అయితే, ఈ మాస్క్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. కొబ్బరిచిప్ప మాస్క్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు.

ఇదిలాఉంటే.. నంగా రూపొందించిన ప్రత్యేక మాస్క్ అతనికి సమస్యలు కొనితెచ్చిపెట్టింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు.. కరోనా మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ చురకలంటించారు. ఆ మాస్క్ తీసేసి.. ప్రామాణికమైన మాస్క్ ధరించాలని సూచించారు. అయితే, విజిల్ వేయడంలో ఇబ్బందిగా ఉందని, ఆ కారణంగానే కొబ్బరి చిప్పను ఉపయోగించి మాస్క్ తయారు చేసుకున్నానని పోలీసులకు నంగా వివరణ ఇచ్చుకున్నాడు.

Also read:

NEET UG 2021: ఇవాళ దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. పూర్తి వివరాలు మీకోసం..

Oil Prices Down: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. దిగుమతి పన్ను తగ్గించిన కేంద్రం.. దిగి వస్తున్న వంటనూనే ధరలు

Lokesh: బంధువులకు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారింది : నారా లోకేష్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XexmCo

Related Posts

0 Response to "Face Mask: కొబ్బరి చిప్పతో మాస్క్.. అదేమంటే విజిల్ కోసమట.. చివరికి పోలీసుల కంటపడటంతో.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel