-->
Red Tamarind : ఎరుపు రంగులో చింతకాయలు.. వారి రక్తమే అందుకు కారణమట.. విచిత్ర చెట్టు వివరాలు మీకోసం..!

Red Tamarind : ఎరుపు రంగులో చింతకాయలు.. వారి రక్తమే అందుకు కారణమట.. విచిత్ర చెట్టు వివరాలు మీకోసం..!

Tamarind Tree

Red Tamarind : చింతకాయ అంటే ఎలా ఉంటుంది…ఆకుపచ్చ, తెల్లని రంగుతో పులుపుగా ఉంటుంది. కానీ ఎర్రగా.. రక్తం మాదిరిగా ఉండే చింతకాయను మీరు ఎప్పుడైనా చూశారా..? అస్సలు చూసి ఉండరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చింతపండును తిన్నట్టైతే నోరంతా ఎర్రగా మారిపోతుంది. పులుసు చేసినా అది రక్తం మాదిరిగా కనబడుతుంది. అంతేకాదు చింతకాయలో రక్తం వాసన కూడా వస్తోంది. ఇంత విచిత్రమైన చింతకాయ చెట్టు ఎక్కడుందనే కదా మీ డౌట్.. అయితే నల్లమల ప్రాంతానికి వెళ్లాల్సిందే.

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామమది. నల్లమల అటవీ ప్రాంతంలో ఓ మారుమూలన పడేసినట్లుంది ఆ గ్రామం. మారుమూల గ్రామమైనప్పటికీ.. ఆ గ్రామంలో పురాతన కట్టడాలు మాత్రం దండిగానే ఉన్నాయి. గ్రామానికి చుట్టూరా పొడవాటి గట్టు ఉంటుంది. ఆ గట్టుపై లక్ష్మినర్సింహ్మ స్వామి, వెంకటేశ్వరస్వామి దేవాలయాలున్నాయి. వీటికన్న ముందుగా ఓంకారేశ్వరుడి ఆలయం, మహాలక్ష్మి ఆలయం, భగీరధుడి ఆలయంతో పాటు 101 నాగుల గుడి కూడా అక్కడ ఉంది. ఆ పక్కనే పెద్ద బావి.. ఆ బావి ఇరువైపుల మర్రి చెట్లున్నాయి. ఆ పక్కనే సుమారు ఐదు వందల మీటర్ల పొడవున ఉడుగ చెట్టు ఉంది. ఆ ఉడుగ చెట్టు కిందనే మైసమ్మ గుడి ఉంది. ఆ ప్రాంతంలోనే ఓ వింత చింతచెట్టు ఉంది. ఆ చింతచెట్టు వద్ద ముస్లీముల సమాధులు కూడా ఉన్నాయి. ఆ చింతచెట్టు కాయలు ఎర్రగా రక్తం రంగులో ఉంటాయి.

ఆ ప్రాంతంలో చాలా చింతచెట్లున్నాయి.. కానీ అవన్నీ సహజంగానే ఉన్నాయి. వాటి చింతకాయలను గ్రామస్తులు తింటారు కూడా. కానీ ఈ ఒకే ఒక్క చింతచెట్టు మాత్రం విచిత్రంగా ఉంది. ఈ చెట్టు కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని తింటే నోరంతా ఎర్రగా మారిపోతుంది. అలాగే పులుసు కూడా రక్తం మాదిరిగా ఉంటుంది. అంతేగాక రక్తం వాసన కూడా వస్తుంటుంది. అందుకే గ్రామస్తులు ఆ చింతచెట్టు జోలికి వెళ్లరు. శాస్త్రీయంగా వేరే కారణాలు ఉండి ఉండవచ్చు.. కానీ గ్రామస్తులు చెప్పే కథ మాత్రం విచిత్రంగానే ఉంది.

రాణీరుద్రమా దేవి మనవడు ప్రతాపరుద్రుడి పాలనలో ధనధాన్యాలను(ఖజానా) నల్లమల అడవిలో దాచే వారట. అందులో భాగంగా మైలారం గ్రామ శివారులో ఉన్న మైసమ్మ గుడి వద్ద ధనాన్ని దాచి పెట్టారని, ఆ ధనానికి అదే గ్రామానికి చెందిన ముస్లీములను కాపలాగా ఉంచే వారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కొందరు దుండగులు ఓ సారి ఆ ముస్లీములపై ఒక్కసారిగా దాడి చేసి వారిని చంపి, ఖజానాను ఎత్తుకెళ్లారట. భోజనం చేస్తున్న సమయంలో వారిపై దాడి జరగడం.. ఆ ప్రాంతమంతా రక్తం ఏరులై పారడం వంటివి జరిగిపోయి. వారి రక్తంలో తడిసిన చింతగింజ మొలకెత్తి ఇలా ఎరుపు రంగులో మారిందని ఆ ప్రాంతంలో కథగా చెప్పుకుంటుంటారు. చింతకాయ ఎరుపు రంగులో ఉండడంతో పాటు ఆ చింతకాయల్లో రక్తం వాసన కూడా వస్తుందని స్థానికులు చెబుతున్నారు. అందుకు ఆ ప్రాంతంలో ఉన్న ముస్లీముల సమాధులే నిదర్శనమని అంటున్నారు.

ఏది ఏమైనా ఆ గ్రామంలోని మిగతా చింతచెట్లు సహజంగానే ఉంటూ..ఈ ఒక్క చింతచెట్టు మాత్రమే ఎరుపురంగులో ఉండడం నిజంగా ఓ అద్భుతమే. కానీ…ఈ చెట్టు ఇలా ఉండడానికి కారణాలేంటో శాస్త్రీయంగా తేల్చాల్సిన అవసరం ఉంది.

Also read:

Face Mask: కొబ్బరి చిప్పతో మాస్క్.. అదేమంటే విజిల్ కోసమట.. చివరికి పోలీసుల కంటపడటంతో..

NEET UG 2021: ఇవాళ దేశ వ్యాప్తంగా నీట్‌ (యూజీ) ఎంట్రెన్స్ టెస్ట్.. పరీక్షలో స్వల్ప మార్పులు.. పూర్తి వివరాలు మీకోసం..

Oil Prices Down: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. దిగుమతి పన్ను తగ్గించిన కేంద్రం.. దిగి వస్తున్న వంటనూనే ధరలు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XeI1NS

Related Posts

0 Response to "Red Tamarind : ఎరుపు రంగులో చింతకాయలు.. వారి రక్తమే అందుకు కారణమట.. విచిత్ర చెట్టు వివరాలు మీకోసం..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel