-->
LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్‌ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు..

LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్‌ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు..

Lpg Cylinder

LPG Cylinder: ఈ రోజుల్లో ఎల్‌పీజీ వంట గ్యాస్‌ తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు కట్టెల పొయ్యిపై చేసుకునే వంట .. ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్యాస్‌ సిలిండర్‌పైనే చేస్తున్నారు. ఇక గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవడంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పటితో పోల్చితే.. ఇప్పుడు చాలా సులభంగా గ్యాస్‌ కనెక్షన్‌ను పొందవచ్చు. అయితే ఈ పద్ధతిని మరింత సులభతరం చేస్తూ ఎప్పటిప్పుడు మరిన్ని మార్పులు చేస్తున్నాయి గ్యాస్‌ కంపెనీలు. సిలిండర్‌ డెలివరి విషయంలో ఎన్నో మార్పులు చేశాయి. బుకింగ్‌ చేసుకున్న వెంటనే సిలిండర్‌ పొందే వెసులుబాటు కూడా వచ్చేసింది.

తాజాగా కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లకుండానే కేవలం మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గ్యాస్ కనెక్షన్ కావాలనుకునే వారు 8454955555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే కంపెనీనే వారిని సంప్రదిస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) పేర్కొంది. వారి నుంచి ఆధార్ లేదా ఇతర అడ్రస్ ప్రూవ్ తీసుకుని గ్యాస్ కనెక్షన్ ఇస్తామని తెలిపింది. ఇదే నంబర్‌తో గ్యాస్ రీఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చని తెలిపింది.

ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందని, కుటుంబంలో ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ ఉంటే.. కొత్త కనెక్షన్ కోసం ఈ కనెక్షన్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోవచ్చని సూచించింది. ఇందుకోసం ఏజెన్సీకి వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తే సరిపోతుందని వివరించింది. ఇక ఐవోసీ కస్టమర్లు ఐదు కేజీల సిలిండర్లు తీసుకునే సర్వీసును దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇలా మారుతున్న కాలానుగుణంగా గ్యాస్‌ కంపెనీలు కూడా ఎన్నో మార్పులు తీసుకువస్తున్నాయి. గతంలో గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే దాదాపు నెల రోజులకు పైగా సమయం పట్టేది. కానీ ఇప్పుడు వెంటనే గ్యాస్ కనెక్షన్‌ పొందే వెసులుబాటు వచ్చేసింది.

ఇవీ కూడా చదవండి:

Work From Home: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. కంపెనీల కొత్త వ్యూహం.. ఉద్యోగులతో కొత్త తలనొప్పులు..!

SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ob0DJV

0 Response to "LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్‌ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel