-->
CM Stalin: మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించిన ముఖ్యమంత్రి

CM Stalin: మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించిన ముఖ్యమంత్రి

Cm Stalin

Tamilnadu CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా పదివి చేపట్టినప్పటినుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రజల కష్టాలను, వారికీ కావాల్సిన అవసరాలను ప్రజల మధ్యకు వెళ్లిమరీ తెలుసుకుంటున్నారు స్టాలిన్. తాజాగా మరోసారి స్టాలిన్ తన మంచి మనసును చాటుకున్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి అండగా నిలిచారు. కిడ్నీ, కాలేయ వ్యాధితో చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం పరామర్శించారు.. వివరాల్లోకి వెళ్తే..

సేలం జిల్లా అరసిపాలయానికి చెందిన 13 ఏళ్ల జనని మూత్రపిండాల వ్యాధితో చెన్నై లో చికిత్స పొందుతుంది.  తల్లిదండ్రులు తమ కూతుర్ని కాపాడమని.. సీఎం స్టాలిన్ కోరుతూ.. సోషల్ మీడియా  వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు.  చిన్నారి జనని వీడియోలకు స్పందించిన సీఎం స్టాలిన్ స్వయంగా చెన్నై లోని స్టాన్లీ హాస్పిటల్ కి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. తల్లిదండ్రులకు దైర్యం చెప్పారు. చిన్నారికి మెరుగయిన వైద్య చికిత్స అందించాలని..  వైద్యులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైద్యానికి అవసరమైన ఆర్ధిక సాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దీంతో సీఎం స్టాలిన్ ప్రభుత్వాస్పత్రికి వచ్చి తమకు ధైర్యం చెప్పడం మా చిన్నారిని కాపాడతామని భరోసా ఇవ్వడంపై జనని తల్లితండ్రులు.. స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. కరోనా సమయంలో స్టాలిన్ ప్రజలకు అండగా నిలిచిన తీరు ఆకట్టుకుంది. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష నేతలకు స్థానం కల్పించిన సీఎం కు మంచి పేరు తెచ్చాయి. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ.. పేదల ఆకలి తీర్చే ప్రభుత్వ క్యాంటిన్లను అదే పేరుతో కొనసాగిస్తున్న స్టాలిన్ నేచర్ కు ప్రతిపక్షాల నేతలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read:

కొత్త గ్యాస్ కనెక్షన్‌ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు..

గులాబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణలో మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AOVU47

0 Response to "CM Stalin: మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్.. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పరామర్శించిన ముఖ్యమంత్రి"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel