
Telangana Assembly: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా

Cyclone Gulab Effect: తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాను వణికిస్తోంది. తుఫాను కారణంగా అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీని మూడు రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు 28న ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ.. తమ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో ఉండి వర్షాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రజాప్రతినిధులందరూ రాజధానికే పరిమితం అవుతారని, అందుకే అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. ప్రజాప్రతినిధులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే ఈనెల 28, 29వ తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రోజులు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామని, పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అలాగే రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఇక హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే 040-23202813 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ఇవీ కూడా చదవండి:
Telangana: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు..
SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్ ఉన్నాయా..? వెంటనే డిలీట్ చేయండి: ఎస్‌బీఐ
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AI7nSV
0 Response to "Telangana Assembly: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా"
Post a Comment