-->
Ganesh Nimajjanam: మహానగరంలో మహోత్సవం.. ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్న గణనాథులు

Ganesh Nimajjanam: మహానగరంలో మహోత్సవం.. ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్న గణనాథులు

Ganesh Nimajjanam In Hydera

గణేష్‌ నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబైంది. 9 రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులు ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్నాయి. ఈ ఉదయం ఆఖరిపూజ అందుకున్న బొజ్జ గణపయ్యలు..ఊరేగింపుగా వస్తున్నాయి. భాగ్యనగర పురవీధులు కాషాయజెండాలతో కళకళ లాడుతున్నాయి. నగరం నలువైపులా నుండి వినాయకసాగర్‌కు గణనాథులు క్యూ కట్టాయి.

ప్రధానంగా బాలాపూర్‌ గణేశుడితో ప్రారంభమైన శోభయాత్ర…ముందుకు కదులుతోంది. బాలాపూర్‌ నుంచి ఫలక్‌నుమా మీదుగా చార్మినార్, అఫ్జల్‌గంజ్‌ , గౌలీగూడచమన్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌ నుంచి ఎన్టీయార్‌ మార్గ్‌కి చేరుకుంటున్నాయి. శోభయాత్ర సాగే దారిలో భాగ్యనగర్‌ ఉత్సవ సమితి…భక్తుల కోసం స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసింది. కొన్ని స్వచ్చంధ సంస్థలు భక్తుల కోసం మంచినీరు, పులిహోర ప్యాకెట్లను అందించే ఏర్పాట్లు చేశాయి.

మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు తలసాని, మహమ్మూద్‌ అలీ హెలికాప్టర్‌లో ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. వారితోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్‌ కూడా ఉంటారు. నగరం నలువైపులా నుండి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వ్యూహాన్ని పరిశీలిస్తారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడూ కంట్రోల్‌ రూమ్‌ నుండి పరిస్థితిని అంచనా వేయనున్నారు.

ఇవి కూడా చదవండి: AP MPTC, ZPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. తేలనున్న 18వేల మంది భవితవ్యం.. పకడ్బందీగా ఏర్పాట్లు..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి.. 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ చూడండి..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EzP8l8

Related Posts

0 Response to "Ganesh Nimajjanam: మహానగరంలో మహోత్సవం.. ట్యాంక్‌బండ్‌ వైపు కదులుతున్న గణనాథులు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel