-->
Typhoid: అసలే వైరల్‌ కాలం.. పొంచి ఉంది టైఫాయిడ్‌ భయం. టైఫాయిడ్‌ వస్తే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..

Typhoid: అసలే వైరల్‌ కాలం.. పొంచి ఉంది టైఫాయిడ్‌ భయం. టైఫాయిడ్‌ వస్తే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..

Typhoid

Typhoid: మొన్నటి వరకు అంతా కరోనా భయంతో వణికిపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో వైరల్‌ జ్వరాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతీ ఇంటిలో ఒక్కరైనా వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఈ వైరల్‌ ఫీవర్‌లో టైఫాయిడ్‌ ఒకటి. సాల్మోనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే ఈ వ్యాధి అనారోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు, కలుషితమైన ప్రాంతాల్లో నివసించడం వల్ల వస్తుంది. టైఫాయిడ్ ముందు జ్వరంతో ప్రారంభమై, తదనంతరం అలసట, తలనొప్పి, అధిక జ్వరం, కడుపులో వాపు, అతిసారం లేదా మలబద్ధకం, గొంతు నొప్పి, ఛాతీపై గులాబీ రంగు మచ్చలు, వికారం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి.

అయితే వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులు సూచించిన ఔషధాలతో పాటు కొన్ని ఆరోగ్య సూత్రాలను సైతం పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వేడి వేడి ఆహారాన్నే తీసుకోవాలి. అలాగే ఇంటి చుట్టూ వాతావరణనాన్ని పరిశ్రుభంగా ఉంచుకోవాలి. టైఫాయిడ్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. టైఫాయిడ్‌ బారిన పడ్డ వారు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

* టైఫాయిడ్‌ సోనిక వారు తరచు కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి. వ్యాధి కారణంగా శరీరంలో శక్తి మొత్తం హరించుకుపోతుంది కాబట్టి కోల్పోయిన శక్తిని పెంచుకునేందుకు ఏదొకటి తింటూ ఉండాలి. అయితే త్వరగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవాలి.

* జ్వరం ఎక్కువ ఉండడం వల్ల ఏది తినాలనిపించదు. అలా అనీ తినకుండా ఉంటే శరీరం మరింత బలహీనంగా మారుతుంది. టైఫాయిడ్‌ బారిన పడ్డారు వీలైనంత వరకు ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. చెమట, వాంతులు అవుతుంటాయి కాబట్టి శరీరంలోని నీటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. దానిని బ్యాలెన్స్‌ చేయడానికి లిక్విడ్‌ను తీసుకోవాలి.

* తీసుకునే ఆహారలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. టైఫాయిడ్‌ కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోటీన్‌ ఫుడ్‌ను తీసుకుంటే శరీరంలో శక్తి వస్తుంది.

* టైఫాయిడ్‌ కారణంగా జీర్ణ వ్యవస్థ కూడా మందగిస్తుంది. దీంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణంకాక కడుపులో వికారంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకునేలా చూసుకోవాలి. నూనెతో చేసినవి కాకుండా ఉడికిన ఆహార పదార్థాలనే తీసుకోవాలి.

* టైఫాయిడ్‌తో బాధపడుతున్నన్ని రోజులు మసాల, కొవ్వు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇలాంటివి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కనుక కొన్ని రోజుల పాటు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.

* విటమిన్‌ ఏ,బీ, సీలు ఎక్కువగా లభించే నారింజ, క్యారట్‌, బంగాళాదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి టైఫాయిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత శరీరాన్ని మళ్లీ తిరిగి యధా స్థానానికి చేరుస్తాయి.

Also Read: Skin Problems-Ayurveda Tips: సాధారణ చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా సైడ్‌ఎఫెక్ట్స్‌లేని ఈ సింపుల్ చిట్కాలు మీకోసం

Sleep tips: మంచి నిద్ర కోసం ఈ 5 పనులు చేస్తే చాలు..! మందులు అవసరం లేదు..

Nipah Virus: నిపా వైరస్‌తో జాగ్రత్త..! ఏ వయసువారు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3hNFfGA

Related Posts

0 Response to "Typhoid: అసలే వైరల్‌ కాలం.. పొంచి ఉంది టైఫాయిడ్‌ భయం. టైఫాయిడ్‌ వస్తే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel