
Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ..! వీడియో

బెల్లంకొండ శ్రీనివాస్.. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ టాలీవుడ్ హీరో అల్లుడు శీను సినిమాతో పరిచయమయ్యారు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ అవుతున్న ఈ హీరో ఛత్రపతి రీ మేక్‌లో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ రీమేక్‌కి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బెల్లంకొండను పరిచయం చేసిన వివినాయకే బాలీవుడ్‌లోను పరిచయడం చేయడం విశేషం..కాగా చత్రపతి కథను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తున్నారట విజయేంద్రప్రసాద్. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. కాగా 2005లో ప్రభాస్ హీరోగా రాజమౌళి ఛత్రపతి సినిమాను తెరకెక్కించారు. ఇందులో శ్రియ హీరోయిన్‌గా నటించగా.. భానుప్రియ, షమీ, ప్రదీప్ రావత్, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రైతులకు మరో వరం.. గడువు లోగా రుణం చెల్లిస్తే 3 శాతం వడ్డీ తగ్గింపు.. వీడియో
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CsVZL6
0 Response to "Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ..! వీడియో"
Post a Comment