-->
Acharya Movie : అనుకున్నదానికంటే ముందే మెగాస్టార్ సినిమా.. ‘ఆచార్య’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Acharya Movie : అనుకున్నదానికంటే ముందే మెగాస్టార్ సినిమా.. ‘ఆచార్య’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Acharya

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి జోరుకు కుర్రహీరోలు కూడా షాక్ అవుతున్నారు. వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇప్పటికే ఆచార్య సినిమా చేస్తున్న చిరు.. ఆ తర్వాత నాలుగు సినిమాలను ఓకే చేశారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు చివరికి వచ్చేసింది. ఈ సినిమాలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్, చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆచార్య రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. విడుదల కోసం సరైన సమయాన్ని వెతికే పనిలో పడ్డారు మేకర్స్.

చాలా కాలంగా వాయిదా పడిన ఆచార్య సంక్రాంతి 2022 సీజన్‌లో విడుదలవుతుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. అయితే సంక్రాంత్రికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతి కంటే ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతే కాదు ఈ ఏడాదే సినిమా రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంట.. క్రిస్మస్ కానుకగా మూవీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మరో వైపు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తర్వాత  మెహర్ రమేష్-బాబిలతో సినిమాలుచేయనున్నారు మెగాస్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా..

Maha Samudram: ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. మహాసముద్రం ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

Bigg Boss 5 Telugu: అబ్బాయిలతోనే బిజీగా ఉంటున్నావ్.. హీట్ పెంచిన ప్రియా కామెంట్స్.. రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

 

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CsVYa0

Related Posts

0 Response to "Acharya Movie : అనుకున్నదానికంటే ముందే మెగాస్టార్ సినిమా.. ‘ఆచార్య’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel