
Andhra Pradesh: ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేశారు.. చివరికి భర్త చనిపోవడంతో..

Andhra Pradesh: వాళ్లిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం.. ఘనంగా పెళ్లి జరిపించారు.. అంతా బాగానే వుందనుకునే సమయంలో పిడుగులాంటి వార్త.. తన భర్తకు రెండు కిడ్నీలు చెడిపోయానని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంది ఆ మహిళ. అయితే విధి ఆమెపై జాలి చూపలేదు. మరోసారి భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి. ఇక ఇలాంటి బాధలు భరించలేని భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆ మహిళ పరిస్థితి ఆగమ్య గోచరంగ మారింది. అయితే, పెళ్లికి ముందే భర్త ఆరోగ్య పరిస్థితి బాగా లేదని యువకుడి తల్లి దండ్రులకు తెలిసినా చెప్పక పోవడం విశేషం.
వివరాల్లోకెళితే.. తిరుపతికి చెందిన ఊహా రెడ్డి అనే యువతికి నెల్లూరు నగరంలోని ధనలక్ష్మిపురంకు చెందిన విజయేంద్ర రెడ్డికి కొంతకాలం క్రితం వివాహమైంది. విహాహమైన కొన్ని నెలలకే అబ్బాయి అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు పోయిన కోడలు, కొడుకు-కోడలికి పుట్టిన ఆరు నెలల పసి బిడ్డను స్వాగతించవలసిన అత్తమామలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఇంటికొచ్చిన వారి పై దాడి చేసి రక్తపు గాయాలతో వెనుకకు పంపారు. భర్త ఇంటికి వచ్చిన కోడలిని అత్తమామలు, బంధువులు రాళ్లు, కర్రలతో కొట్టి గాయపరిచారు. గతంలోనూ ఇదే విధంగా జరిగితే పోలీసులను ఆశ్రయించిన ఊహారెడ్డికి నిరాశే ఎదురైంది. అయితే కుతురిలా ఆదరించాల్సిన కోడలిపై దాడి చేసిన అత్త మామలకు పెద్ద స్థాయిలో పలుకుబడి ఉండటంతో తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఊహా రెడ్డి ఆరోపిస్తోంది. అధికారులు, ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది ఊమా రెడ్డి.
Also read:
TRS Bhavan: టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో విజయం.. దేశరాజధానిలో TRS భవనం.. ఇవాళ సీఎం కేసీఆర్ భూమిపూజ
PAN Card: మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతోందా? ఏమాత్రం లేట్ చేయకుండా ఇలా చెక్ చేసుకోండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mVvo4I
0 Response to "Andhra Pradesh: ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేశారు.. చివరికి భర్త చనిపోవడంతో.."
Post a Comment