-->
Andhra Pradesh: పిలవని పేరంటానికి వస్తారు.. వేలకు వేలు డిమాండ్ చేస్తారు.. ఇస్తే ఓకే.. లేదంటే సీన్ మామూలుగా ఉండదు..

Andhra Pradesh: పిలవని పేరంటానికి వస్తారు.. వేలకు వేలు డిమాండ్ చేస్తారు.. ఇస్తే ఓకే.. లేదంటే సీన్ మామూలుగా ఉండదు..

Marriage

Andhra Pradesh: తిరుపతిలో ఇప్పుడు పెళ్లిళ్లు జరిగే కళ్యాణ మండపాల వద్ద వాళ్లదే హడావుడి. గుంపులు గుంపులుగా వచ్చి పెళ్లి వేదికలను కవర్ చేయడం వాళ్ళ పని. మూడు ముళ్ళతో ఒక్కటి కాబోయే దంపతులకు దిష్టి తీసి వేలకు వేల రూపాయల కోసం దౌర్జన్యం చేయడం.. వారు అడిగినంత డబ్బులిచ్చేంత వరకు హడావుడి చేయడం వాళ్ళ టాస్క్.. ఇంతకీ వారు ఎవరు? ఏంటా కథ? ఇప్పుడు తెలుసుకుందాం.

టెంపుల్ సిటీ తిరుపతి, తిరుచానూరులో పెళ్లి సంబరాల్లో ఇప్పుడు హిజ్రాల హల్ చల్ కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చేతి నిండా డబ్బు సంపాదించు కోవచ్చనుకున్న హిజ్రాలు.. దిష్టి పేరుతో పెళ్లి వేడుకల్లో నానా హడావుడి చేస్తున్నారు. తిరుపతి, తిరుచానూరులో పెళ్లిళ్లు జరిగే కళ్యాణ మండపాల్లో వేధికలపైకి గ్రూపులుగా చేరి నానా హంగామా చేస్తున్నారు. దిష్టి పేరుతో దౌర్జన్యాలకు పాల్పడటమే కాదు.. వేలకు వేల రూపాయలు డిమాండ్ చేయడం పనిగా పెట్టుకున్నారు.

ఆడిగినంతా ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతున్నారు. సంతోషంగా పెళ్లి సంబరాల్లో ఉండే వారు మూడ్ పాడుచేసేలా వ్యవహరిస్తున్నారు. తాము డిమాండ్ చేసినంత డబ్బు ఇచ్చేంతవరకు నూతన వధూవరులు ఉండే వేదికపైనే డాన్సులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో పెళ్లి వేడుకల్లో హిజ్రాల గోల ఎందుకని అడిగినంత ఇచ్చుకుంటున్నారు పెళ్లి వాళ్ళు.

అయితే, డబ్బులు ఇచ్చేవాళ్లు ఇస్తుండగా.. మరొకొందరు హిజ్రాల తీరుతో విసిగిపోతున్నారు. హిజ్రాల ఆగడాలపై పట్టించుకోని పోలీసులు తీరును ప్రశ్నిస్తున్నారు. తిరుచానూరు లో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కల్యాణ మండపాల్లో ఇలాంటి దందాలు కొనసాగుతున్నా తమకు కనిపించనట్లు వ్యవహరించడం విమర్శలకు కారణమవుతోంది. మరోవైపు పోలీసులకు మాత్రం తమకు హిజ్రాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదంటున్నారు.

ఇక పెళ్లి మండపాలలోనే కాదు.. ఈ హిజ్రాల గొడవ తిరుపతికి చేరుకునే రోడ్లలో ప్రతి చోటా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకునే భక్తులు, వాహనదారుల పట్ల బెగ్గింగ్ పేరుతో బరితెగించి ప్రవర్తిస్తున్నారు. దైవదర్శనం కోసం వస్తే వీరి గోల ఏంటి అనేలా వ్యవహరిస్తున్నారు. అయితే రోడ్లపై ఎక్కడ పడితే వాహనాలను ఆపడం, బైక్ లపై పడిపోయి మరి డబ్బులు దండుకోవడం హిజ్రాలు పనిగా మారిపోయింది. రోడ్లపై స్పీడ్ బ్రేకర్స్ వద్ద బ్రేక్ వేసే ప్రతి వాహనం కప్పం కట్టాల్సిందే అన్నట్లు చెక్ పోస్టు మామ్ముళ్ల లాగా వసూలు చేస్తున్నారు హిజ్రాలు. అయితే, వీరి ఆగడాలపై పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.

ఇదిలాఉంటే.. ఇక హైవేలపై హిజ్రాలు కనిపిస్తే కేసులు పెట్టాలన్న పోలీసు బాస్ ల ఆర్డర్ ను.. కిందిస్థాయి పోలీసు అధికారులు చెవికి ఎక్కించుకోక పోతున్నారు. దీంతో హిజ్రాలు కూడా అడ్డూ అదుపులేకుండా దౌర్జన్యాలకు దిగి దందా కొనసాగిస్తున్నారు.

Also read:

Andhra Pradesh: ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేశారు.. చివరికి భర్త చనిపోవడంతో..

Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో

TRS Bhavan: టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో విజయం.. దేశరాజధానిలో TRS భవనం.. ఇవాళ సీఎం కేసీఆర్ భూమిపూజ



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3zCWktv

Related Posts

0 Response to "Andhra Pradesh: పిలవని పేరంటానికి వస్తారు.. వేలకు వేలు డిమాండ్ చేస్తారు.. ఇస్తే ఓకే.. లేదంటే సీన్ మామూలుగా ఉండదు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel