-->
Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో

Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో

Hotel Staff Attack

Hotel SR Grand: అనంతపురం నగరంలోని హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌లో ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ మీద రిసెప్షనిస్ట్, హోటల్ సిబ్బంది దాడి చేశారు. హోటల్లో మ్యారేజ్ కవరేజ్ చేయడానికి ఫోటోగ్రాఫర్ వెళ్లగా లిఫ్ట్‌లో పైకి వెళ్లే క్రమంలో అక్కడున్న సిబ్బంది, ఫోటోగ్రాఫర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఫోటోగ్రాఫర్ దురుసు ప్రవర్తనను వారించిన అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ అంటూ హోటల్ సిబ్బంది చెప్పుకొస్తున్నారు. అంతేకాదు, రిసెప్షనిస్ట్ పై ఫోటోగ్రాఫర్ చేయి చేసుకున్నారని అంటున్నారు.

దీంతో ఆగ్రహంతో ఫోటో గ్రాఫర్ పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు ఫోటో గ్రాఫర్ పై దాడిన ఖండిస్తూ ఆందోళకు దిగారు. పరస్పరం కేసులు పెట్టుకోవడంతో విచారణ చేస్తున్నారు నాల్గవ పట్టణ పోలీసులు. ఇలా ఉండగా, వీడియోల్లో రికార్డయిన దృశ్యాల్లో మాత్రం హోటల్ సిబ్బంది మొత్తం కలిసి ఒక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ మీద విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డట్టు కనిపిస్తోంది. ఆ దృశ్యాల వీడియో ఇదే..

Read also: Tandur municipal chairperson: నిలదీస్తే చెప్పుతో కొడతా.. మరోసారి నోరు పారేసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్న



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BAOIs8

0 Response to "Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel