
TTD: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. పలు అంశలపై నిర్ణయం తీసుకునే అవకాశం..

ఇవాళ ఉదయం 10 గంటలకు ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో చర్చించడానికి 55 అంశాలతో అజెండాను రూపొందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతిన్న ఘాట్ రోడ్డు మరమ్మతులపై బోర్డు చర్చించనుంది. భవిష్యత్తులో కొండచరియల సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
తిరుమలలో విధుల బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఎఫ్ఎంఎస్ కార్మికులపై సమస్యలపై కూడా చర్చించే అవకాశం అవకాశం ఉంది. శ్రీవారి ఆభరణాల్లో విరిగిన విలువైన రాళ్లను నిబంధనల ప్రకారం మార్చేందుకు టీటీడీ ఆమోదం తెలపనుంది. బంగారు ఆభరణాలను కరిగించి గోల్డ్ బార్స్ రూపంలోకి మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2005 నుంచి పట్టు వస్త్రాలపై ప్రభుత్వం టీటీడీకి ఉన్న బకాయిలపై బోర్డు చర్చించనుంది. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎస్బీఐకు మార్చే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టీటీడీలో పని చేస్తున్న శ్రీవారిసేవ క్షౌరకులకు వేతనాల పెంపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉంది. తిరుమల, తిరుపతిలో పలు ఇంజినీరింగ్ పనులకు పాలకమండలి ఆమోదం తెలపనుంది. నూతన సంవత్సరం, జనవరి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై బోర్డు సభ్యులు సమీక్షించనున్నారు.
Read Also.. Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31RdlED
0 Response to "TTD: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. పలు అంశలపై నిర్ణయం తీసుకునే అవకాశం.."
Post a Comment