-->
Nithya Menen: ప్రభాస్ ఇష్యూతో మానసికంగా కృంగిపోయాను.. అలా రాయడంతో బాధపడ్డాను.. నిత్యమీనన్ షాకింగ్ కామెంట్స్..

Nithya Menen: ప్రభాస్ ఇష్యూతో మానసికంగా కృంగిపోయాను.. అలా రాయడంతో బాధపడ్డాను.. నిత్యమీనన్ షాకింగ్ కామెంట్స్..

Nithya Menen

అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి ఎంట్రీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నిత్యా మీనన్.. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కేవలం హీరోయిన్‏గానే కాకుండా.. సింగర్‏గానూ తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకుంది నిత్యా మీనన్. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది నిత్యమీనన్. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది నిత్యామీనన్. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో కేవలం హీరోయిన్‎గానే కాకుండా.. నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది నిత్యామీనన్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిత్యా మాట్లాడుతూ.. తనకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. నిత్యా మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే.. ఆ ఇష్యూ నన్ను ఇప్పటికీ మానసికంగా బాధపెట్టింది. నా గురించి జర్నలిస్ట్స్ అలా రాయడంతో హర్ట్ అయ్యాను. అలా మొదలైంది సినిమా వచ్చినప్పుడు నేను చిన్నదాన్ని. అప్పుడే నేను కొత్తగా వచ్చాను. ఫస్ట్ సినిమా అలా మొదలైంది. నాకు తెలుగు సరిగా రాదు.. తెలుగు సినిమాలు కూడా చూడలేదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు…నాకు తెలియదని చెప్పాను.

ఆ విషయాన్ని పెద్దది చేశారు. నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. ఆ ఇష్యూతో హానెస్ట్ గా అన్ని చోట్లు ఉండకూడదని..ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని.. మాటల గారడీ చేస్తేనే నచ్చుతుందని అర్థమైందని.. అక్కడ ఉన్న మీడియా వాళ్లకు కూడా తెలుసు నాకు తెలుగు రాదని.. ప్రభాస్ ఎవరో తెలియదని..అందుకే నన్ను కావాలని అడిగారు.. నాకు తెలియదు కాబట్టి తెలియదని చెప్పేశా.. ఆ విషయాన్ని పెద్దది చేశారు.. దీంతో చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్..

Also Read: Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3yiIkFO

Related Posts

0 Response to "Nithya Menen: ప్రభాస్ ఇష్యూతో మానసికంగా కృంగిపోయాను.. అలా రాయడంతో బాధపడ్డాను.. నిత్యమీనన్ షాకింగ్ కామెంట్స్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel