-->
TTD Srivani Break Darshan: నేడు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల.. ఆన్‌లైన్‌లో

TTD Srivani Break Darshan: నేడు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల.. ఆన్‌లైన్‌లో

Ttd

Srivani break darshan tickets: శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్లు నేడు (మంగళవారం) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. జనవరి, ఫిబ్రవరి కోటాను మధ్యాహ్నం 3 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు (రూ.500), వైకుంఠ ఏకాదశి, జనవరి 13న రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్ల (రూ.300)ను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే జనవరి 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన (రూ.500) టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్‌ దర్శన టికెట్లను సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆది వారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన టికెట్ల(రూ.500)ను విడుదల చేయనున్నారు.

సర్వ దర్శన టికెట్లు 15 నిమిషాల్లోనే ఖాళీ..
కాగా.. తిరుమల శ్రీవారి సర్వ దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో సోమవారం విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి రోజుకు పది వేల చొప్పున టికెట్లను విడుదల చేసింది. జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించారు. దీంతో 15 నిమిషాల్లోనే టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. వైకుంఠ ఏకాద‌శి (వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13 నుంచి 22 వ‌ర‌కు రోజుకు 5 వేల చొప్పున.. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టైంస్లాట్ టోకెన్లు విడుద‌ల చేశారు.

Also Read:

Tirumala Tirupati Devasthanams: అలెర్ట్.. శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు రద్దు.. ఎప్పుడెప్పుడంటే?

జాతకంలో శుక్రుడు బలంగా లేకుంటే డబ్బుకు లోటు..! ఇలా చేస్తే శుభ పరిణామాలు

Astro Tips: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HhUl1q

Related Posts

0 Response to "TTD Srivani Break Darshan: నేడు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల.. ఆన్‌లైన్‌లో"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel