TTD Darshan: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు.. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి..

TTD Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ జనవరి నెలకుగాను టికెట్లను జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత రోజువారీ దర్శన టికెట్లను తగ్గించిన టీటీడీ తాజాగా క్రమంగా పెంచుకుంటూ పోతోంది. గడిచిన నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి ఒకేసారి టికెట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒమిక్రాన్ భయాలు పొంచి ఉన్న నేపథ్యంలో జనవరి ఒక్క నెలకే టోకెన్లు జారీ చేశారు. ఇందులో భాగంగానే జనవరి నెలకు సంబంధించి స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డి) టోకెన్లను టీటీడీ ఈరోజు ఉదయం (డిసెంబర్ 27) 9 గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు ఆధార్ కార్డు వివరాలతో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక ఏకాదశి సందర్భంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కేవలం గంట వ్యవధిలోనే బుక్ కావడం విశేషం. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షల టికెట్లను విడుదల చేశారు.
కరోనా నిబంధనలు తప్పనిసరి..
ఇక కరోనా నిబంధనలు టీటీడీ మరింత కఠినతరం చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ నెగిటివ్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది టీటీడీ. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు సూచించింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని నేపథ్యంలో దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని భక్తులకు స్పస్టం చేసింది.
Also Read: IND VS SA: సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ.. 14 ఏళ్ల కరువును తీర్చిన భారత ఓపెనర్..!
Drones for Agriculture: డ్రోన్లతో వ్యవసాయం..ఎంతో ప్రయోజనకరం..ఎలానో తెలుసా?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3JhS73L


0 Response to "TTD Darshan: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు.. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి.."
Post a Comment