-->
Telangana: ఈ ఏడాది ట్రాఫిక్‌ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది..

Telangana: ఈ ఏడాది ట్రాఫిక్‌ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది..

Traffic Challans

కో అంటే కోట్లు వచ్చి పడుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిలబడితే.. కాసులు గలగల అంటున్నాయి. రూల్స్ బ్రేక్‌ చేస్తున్న వాహనదారులు తెలంగాణ సర్కారుకు కల్పతరువులా మారారు. 2021 ముగుస్తోంది. మరికొద్ది రోజుల్లో 2022 రాబోతుంది. మరి ఈ ఏడాది కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయ లెక్కలు వింటే సగటు వాహనదారులు అవాక్కవ్వాల్సిందే. ఈ ఏడాది కాలంలో చలనాల రూపంలో 533 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే రోజుకు సగటున కోటిన్నర రూపాయలు. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు ఫైన్‌లు విధిస్తున్నారు. ఇలా 533 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరాయి. ఇందులో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్‌ చేసేనవే ఎక్కువ. మొత్తం జరిమానాల్లో 37.33 శాతం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినవే. ఆ తర్వాతి స్థానం 27.2% ఓవర్ స్పీడ్, ఆ తర్వాత 10.2 శాతం ట్రిపుల్‌ రైడింగ్‌. మొత్తం వసూళ్లలో ఈ మూడింటివే 74.7 శాతంగా నమోదయ్యాయి. అంటే టూవీలర్స్‌ నుంచి ఎక్కువ ఫైన్ వసూలు చేశారు ట్రాఫిక్‌ పోలీసులు.

రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా మరణిస్తున్నారు. హెల్మెట్ ధరించని కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో వీరిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి తాగుబోతుల జేబుకు చిల్లుపెడుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా నాలుగైదు నెలలపాటు వాహనాలు రోడ్డెక్కకపోయినా ఏకంగా 613 కోట్ల రూపాయల ఫైన్‌ విధించారు. గత ఆరేళ్లలో వాహనదారుల నుంచి పోలీసులు 2,131 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ ప్రయాణం, సిగ్నల్ జంపింగ్, సీట్‌ బెల్ట్ ధరించకపోవడం, తాగి వాహననం నడపడంతో పోలీసులు పట్టుకొని ఫైన్‌ విధిస్తున్నారు.

Also Read: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FLxsTP

0 Response to "Telangana: ఈ ఏడాది ట్రాఫిక్‌ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel