
Monkey Viral Video: ఈ కోతి ఎంత బుద్దిమంతురాలో…! చూస్తే నోరెళ్ల బెడతారు..! ఆకట్టుకుంటున్న వీడియో..

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి సెలూన్ షాపులో దర్జాగా కూర్చోని కటింగ్ చేయించుకుంటుంది. అంతేకాదు.. ఆ కటింగ్ చేస్తున్న వ్యక్తి ముందు ఎంతో బుద్దిగా కూర్చోని.. అతనికి సహకరిస్తుంది. కోతికి కాలర్ చూట్టూ ఒక క్లాత్ చుట్టి పెద్ద అద్దం ముందు కూర్చోబెట్టారు. కటింగ్ చేస్తున్న వ్యక్తి.. కోతి వెంట్రకలను దువ్వి ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‌తో ట్రిమ్ చేస్తుంటే.. కోతి ఓపికగా కూర్చుని అతనికి సహకరిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. బ్యూటీ పార్లర్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఆ కోతి ఎంతో అందంగా కనిపిస్తుందని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతుంది.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EP2bPd
0 Response to "Monkey Viral Video: ఈ కోతి ఎంత బుద్దిమంతురాలో…! చూస్తే నోరెళ్ల బెడతారు..! ఆకట్టుకుంటున్న వీడియో.."
Post a Comment