
Indigo Bumper Offer: విమాన ప్రయాణం చేసేవారికి ఇండిగో ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే విమాన టికెట్

Indigo Bumper Offer: విమాన ప్రయాణం చేసేవారికి ఇది శుభవార్తే. శీతాకాలంలో ప్రయాణం చేయాలని భావించే వారికి ఇండిగో ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. షిల్లాంగ్ టూర్ వెళ్లాలనుకునేవారికి రూ.1,400కే విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. అయితే ఇండిగో ఎయిర్‌లైన్ ఇప్పటికే చాలా మార్గాలలో నేరుగా కొత్త విమానాలను నడుపుతోంది. అయితే నవంబర్ 2 నుంచి డిబ్రూగఢ్ నుంచి షిల్లాంగ్ మధ్యలో డైరెక్ట్ విమానాలను ప్రారంభించింది ఇండిగో. ఆఫర్లలలో భాగంగా ఈ విమాన ప్రయాణం ధర రూ.1,400గా నిర్ణయించింది. ఈ మేరకు ఇండిగో తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించింది. తమ నాన్ స్టాప్ ఫ్లయిట్స్‌తో దేశంలో దాగివున్న ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను తాము కనుగొంటున్నామని ఇండిగో ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది.
కాగా, డిబ్రూగడ్ నుంచి షిల్లాంగ్ మధ్య ప్రయాణం చేసేందుకు నేరుగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో చాలా మంది రోడ్డు, రైలు మార్గంలో దాదాపు 12 గంటలు ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఇండిగో ఎయిర్ లైన్స్ కారణంగా ఈ 12 గంటల ప్రయాణాన్ని కేవలం 75 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
ఏ మార్గంలో ఎంత ధర..
ఇండిగో ఎయిర్ లైన్ ట్విటర్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం.. షిల్లాంగ్ టూ డిబ్రూగఢ్… రూ.1400, డిబ్రూగఢ్ నుంచి షిల్లాంగ్… రూ.1400, ఇక కోయంబత్తూర్ నుంచి తిరుపతి… రూ.2499, తిరుపతి నుంచి కోయంబత్తూర్.. రూ.2499, అలాగే రాయ్‌పూర్ నుంచి భువనేశ్వర్.. రూ.2499
భువనేశ్వర్ నుంచి రాయ్‌పూర్… రూ.2499 ధర నిర్ణయించినట్లు తెలిపింది. ఈ విమాన ప్రయాణం చేసేవారు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ https://www.goindigo.in/ను సందర్శించి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Exclusively planned for your bucket list. Book now https://t.co/KVQtwnqQsn.#aviation #LetsIndiGo #Travel #exclusive #network #destination #visit pic.twitter.com/MoPLif5jNU
— IndiGo (@IndiGo6E) December 8, 2021
ఇవి కూడా చదవండి:
Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!
Income Tax: ఈ ఆదాయాలపై మీరు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.. అవి ఏంటో తెలుసా..?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DHgXGf
0 Response to "Indigo Bumper Offer: విమాన ప్రయాణం చేసేవారికి ఇండిగో ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే విమాన టికెట్"
Post a Comment