
Director Deva Katta: నా సినిమాలో ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్ చర్చించే విషయమే: దేవాకట్టా

Director Deva Katta: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఇటీవలే ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసింద. దేవాకట్టా దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా రెస్పాన్స్ అందుకుంది. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఓటీటీ లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5.. ఈసందర్భంగా రిపబ్లిక్ మూవీ దర్శకుడు నాకు కూడా ఫ్యామిలీ స్టోరీస్ చేయాలని ఉంది. నా దగ్గర 2,3 స్టోరీస్ ఉన్నాయి అన్నారు. వెన్నెల కూడా నేను అనుకున్న స్థాయిలో చేయలేదనిపిస్తుంది. వెన్నెల తర్వాత ప్రస్థానం కథ చెబితే కొందరు హీరోలు వెన్నెలకు కొద్దిగా యాక్షన్ కలిపి తీసుకురా అన్నారు. ప్రస్థానం తర్వాత అది తప్ప మరోటి ఊహించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు అన్నారు.
ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని మేం ముందే ఊహించాం. సినిమామీద మాకు ముందు నుంచి చాలా నమ్మకం ఉంది. గతంలో ఓ ప్రతిఘటన, ఓ రేపటిపౌరులు వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాం. కానీ గత 15, 20 సంవత్సరాలుగా ఆ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌ను కోల్పోయాం. అది మనం చేసినతప్పే. ప్రేక్షకులకు మనం సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న కంటెంట్‌ను ఇస్తే తప్పకుండా ఆనందిస్తారు.. ఆదరిస్తారు. మా ‘రిపబ్లిక్’ ఓటీటీలో గ్రాండ్ సక్సెస్ కావటానికి ప్రధాన కారణం.. జీ5 వారు ప్రమోట్ చేసిన విధానమే అని కన్‌ఫర్మ్‌గా చెప్పగలను. ఆడియెన్స్ అంటే అందరూ మన మనసులోనే ఉంటారు. కాబట్టే మనం రాసే క్యారెక్టర్స్ వారికి కనెక్ట్ అవుతుంటాయి. రిపబ్లిక్ లోని ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్ చర్చించే విషయమే. ఈ కథ సమాజంలోని ఒక డీప్ డిస్టబెన్స్ నుంచి పుట్టింది కాబట్టే అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. నెక్ట్స్ ఏ ఎమోషన్‌తో సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పుకొచ్చారు దర్శకుడు దేవాకట్టా
మరిన్ని ఇక్కడ చదవండి :
Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..
RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!
Kamal Haasan: విక్రమ్ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్.. సినిమా విడుదల ఎప్పుడంటే!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Egq5lC
0 Response to "Director Deva Katta: నా సినిమాలో ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్ చర్చించే విషయమే: దేవాకట్టా"
Post a Comment