-->
Debt Management: కరోనా కాలంలో అప్పుల ఊబిలో చిక్కుకున్నారా.. రుణాల చిక్కుముడిని విప్పుకోండి ఇలా!

Debt Management: కరోనా కాలంలో అప్పుల ఊబిలో చిక్కుకున్నారా.. రుణాల చిక్కుముడిని విప్పుకోండి ఇలా!

Debt Managment Plan

Debt Management: కరోనా మహమ్మారి ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. కొంతమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ పరిస్థితి చాలా నెలలు కొనసాగింది. కొంతమంది దీర్ఘకాలిక జీతం కోతలను ఎదుర్కోవలసి వచ్చింది. దీంతోపాటు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం.. ఆరోగ్య అవసరాల కారణంగా, ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా కొంతమంది అప్పులను ఆశ్రయించవలసి వచ్చింది. ఒక రుణం తీర్చుకోవాలంటే మరో రుణం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రజలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అలాంటి ఇబ్బందులను నివారించవచ్చు. ప్రాధాన్యతలను నిర్ణయించడం ద్వారా రుణాలను క్రమపద్ధతిలో తిరిగి చెల్లించినట్లయితే, మీరు సులభంగా రుణ విముక్తి పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

చిన్న రుణాలను ముందుగా చెల్లించండి

అప్పుల ఊబినుంచి బయటపడటానికి ఇది ఉత్తమ మార్గం. చిన్న అప్పులు.. ఒకసారి తిరిగి చెల్లించే రుణాలను ముందుగా చెల్లించండి. ఇది మీపై ఉన్న అప్పుల సంఖ్యను తగ్గిస్తుంది. దీంతో మొదట మీకు కొంత మనశ్శాంతి వస్తుంది. తరువాత మిగిలిన అప్పులను తీర్చడానికి అవసరమైన ధైర్యం మీకొస్తుంది.

రుణం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించుకోవాలి..

మీరు ఒకటి కంటే ఎక్కువ రుణాలను కలిగి ఉన్నట్లయితే, ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించుకోవడం మంచింది. మీకున్న రుణాలు.. వాటికి ఉన్న కాలవ్యవధి.. మీ ఆదాయం ఇలా అన్నిటినీ బేరీజు వేసుకుంటూ ఈ రుణ బడ్జెట్ తాయారు చేసుకోవాలి. ఒకవేళ ఆకస్మిక పరిస్థితి వస్తే, దానికి ముందు ఏ రుణాన్ని తిరిగి చెల్లించాలో నిర్ణయించుకోండి. ముందు చిన్న రుణ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వండి. తర్వత మీరు చాలా కాలం నుంచి ఉన్న అప్పును ముందుగా తీర్చేయాలి.

రుణాన్ని పునర్నిర్మించండి..

మీకు పెద్ద రుణం ఉంటే, మీరు దానిని పునర్నిర్మించవచ్చు. చాలా బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రక్రియలో, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ వ్యక్తిగత రుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. పెనాల్టీ కూడా మాఫీ చేసే అవకాశం ఉంది.

ఆస్తిని ఉపయోగించుకోండి..

మీరు మీ అప్పును తిరిగి చెల్లించడంలో విఫలమైతే చట్టపరమైన ఇబ్బందులు లేదా ఇతర విపత్తులకు దారితీసే ఏదైనా రుణం ఉంటే వెంటనే దానిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. దీనికోసం మీ ప్రావిడెంట్ ఫండ్ లేదా మరేదైనా పెట్టుబడిని ముందస్తుగా తనఖా పెట్టడానికి, విక్రయించడానికి లేదా రీడీమ్ చేయడానికి వెనుకాడకండి.

తగ్గుతున్న వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందండి..

మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేట్లలో రుణం తీసుకున్నట్లయితే, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మీ రుణంపై వడ్డీ రేట్లను తగ్గించమని మీ బ్యాంకు లేదా రుణ సంస్థను అడగండి. ఇది కాకపోతే, మీరు మీ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుతో మరొక బ్యాంకు లేదా సంస్థకు మార్చవచ్చు.

పన్ను ప్రయోజన రుణాన్ని ఏకమొత్తంలో తిరిగి చెల్లించవద్దు..

గృహ రుణం, విద్యా రుణం అలాగే, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత రుణాలు కూడా పన్ను ప్రయోజనాలను పొందుతాయి. నిర్ణీత వ్యవధిలోగా వాటిని తిరిగి చెల్లించడం మరింత ప్రయోజనకరం. వాటిని ఏకమొత్తంలో చెల్లించడానికి తొందరపడకండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి: తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఎప్పుడూ ఎక్కువ వడ్డీ రేటుకు రుణం తీసుకోకండి. బ్యాంకులు లేదా ప్రముఖ సంస్థల నుంచి మాత్రమే రుణాలు తీసుకోండి. వడ్డీ వ్యాపారుల వలలో పడకండి. రుణం తీసుకునే ముందు, వివిధ రుణదాతల వడ్డీ రేట్లను అధ్యయనం చేయండి.

ఇవి కూడా చదవండి: Pushpa: The Rise: హిందీలోనూ తగ్గేదే లే అంటున్న ‘పుష్ప’రాజ్.. భారీ వసూళ్లు దిశగా..

Viral Video: చలికాలం అవస్థలు.. కింద మంట పైన స్నానం.. వీడియో చూస్తే షాక్‌..

Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3JauFW9

Related Posts

0 Response to "Debt Management: కరోనా కాలంలో అప్పుల ఊబిలో చిక్కుకున్నారా.. రుణాల చిక్కుముడిని విప్పుకోండి ఇలా!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel