-->
Cheddi Gang: ఏపీలో దడ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్‌ ఇదే.. వీరిని ఎప్పుడైనా గుర్తుపట్టారా..

Cheddi Gang: ఏపీలో దడ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్‌ ఇదే.. వీరిని ఎప్పుడైనా గుర్తుపట్టారా..

Cheddi Gang In The Ap
Cheddi Gang: ఏపీలో చెడ్డీ గ్యాంగ్‌ దడ పుట్టిస్తోంది. బలమైన ఆయుధాలతో ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తోంది. పట్టుకునేలోపే పారిపోతారు.. గుర్తించేలోపు అడ్డా మార్చి గాయబ్ అవుతారు.. ఇదీ చెడ్డీ గ్యాంగ్‌ స్టయిల్‌. చిక్కరు.. దొరకరు అనే టైపులో ఖాకీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు ముఠా సభ్యులు. ఈ దోపిడీ ముఠా మెంబర్స్ మొన్న విజయవాడలో నిన్న గుంటుపల్లి, తాడేపల్లి.. లెటెస్ట్‌గా నల్లూరి ఎన్‌క్లేవ్‌లో ప్రత్యక్షమయ్యారు. సీసీ ఫుటేజ్ ఆనవాళ్లతో పోలీసుల పట్టుకునే లోపే పత్తాలేకుండా పోయారు. వరుస దోపిడీలు బెజవాడ, గుంటూరు వాసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దోపిడీలు, దాడులకు తెగబడుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. చెడ్డీగ్యాంగ్‌ హల్‌ చల్‌ చేస్తుండటంతో కంటిమీద కనుకులేకుండా గడుపుతున్నారు జనం.

అయితే తాజాగా చెడ్డీగ్యాంగ్‌ ఫొటోలు విడుదల చేశారు విజయవాడ పోలీసులు. గుజరాత్‌లోని దాహాద్‌ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్‌ వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. దీంతో గుజరాత్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులను సంప్రదించారు ఏపీ పోలీసులు. దాహాద్‌ ప్రాంతంలో ఓ ముఠా ఇలాంటి దోపిడీలకు పాల్పడుతోందని వెల్లడించారు గుజరాత్‌ పోలీసులు.

మరిప్పుడు చెడ్డీ గ్యాంగ్‌ మెంబర్స్‌ ఏ ఊళ్లో ఉన్నారు? ఏ గల్లీలో అడ్డావేశారు? ఎవరి ఇంటికి స్పాట్‌ పెడుతున్నారు? ఈ అనుమానాలు స్థానికుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

చీమ కదిలినా అలికిడి పసిగట్టేలా.. జింకను వేటాడేందుకు కదిలే పులిలా వాళ్ల కదలికలు ఉన్నాయి. ఒకరిద్దరు కాదు ఏకంగా పదిమంది బయలెళ్లుతున్నారు. ఒంటికి చెడ్డీ.. తలకు పాగా.. చేతిలో పలుగు పార పట్టుకుని ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. వాళ్ల యాక్షన్‌ చూస్తుంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది.

ఇవి కూడా చదవండి: TS MLC Elections 2021 Live: మొదలైన సందడి.. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికల పోలింగ్..

Chanakya Niti: మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30dAkcl

0 Response to "Cheddi Gang: ఏపీలో దడ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్‌ ఇదే.. వీరిని ఎప్పుడైనా గుర్తుపట్టారా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel