
మద్యం తాగడానికి వయసు సడలించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఎంత తగ్గించిందంటే..?

Haryana:ఈ చలికాలంలో హర్యానా ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసే వయస్సులో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు 21 ఏళ్ల యువత కూడా మద్యం కొనుగోలు చేయవచ్చు.. తాగవచ్చు. హర్యానా శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ‘హర్యానా ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2021’ని ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో మద్యం కొనుగోలు, తాగే కనీస వయస్సు 21 సంవత్సరాలు. ఇది ఇంతకుముందు 25 సంవత్సరాలుగా ఉండేది.
2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీని రూపొందించేటప్పుడు అనేక ఇతర రాష్ట్రాలు కనీస వయోపరిమితిని నిర్దేశించినందున వయోపరిమితిని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించడానికి చర్చించారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కూడా ఇటీవల ఈ వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించింది. ఈ వయసువారు మద్యపానం విషయంలో హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.
హర్యానా ఎక్సైజ్ చట్టం 1914లోని సెక్షన్ 27 ప్రకారం.. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం మద్యం లేదా మాదక ద్రవ్యాల తయారీకి అలాగే టోకు లేదా రిటైల్ విక్రయాల లీజును మంజూరు చేయదు. హర్యానా ఎక్సైజ్ (సవరణ) బిల్లులోని సెక్షన్ 62 ప్రకారం లైసెన్స్ పొందిన విక్రేత లేదా అతని ఉద్యోగి లేదా అతని తరపున పనిచేసే ఎవరైనా సరే.. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి మద్యం లేదా డ్రగ్‌ను విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షతో పాటు 50 వేల జరిమానా విధిస్తారు.
అదేవిధంగా హర్యానా ఎక్సైజ్ (సవరణ) బిల్లులోని సెక్షన్ 29 ప్రకారం.. ఏదైనా లైసెన్స్ పొందిన విక్రేత లేదా విక్రేత తరపున పనిచేసే వ్యక్తి 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మద్యం, డ్రగ్స్ పంపిణీ చేయకూడదు. సెక్షన్ 30 ప్రకారం.. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషుడు లేదా స్త్రీలను మద్యం లేదా డ్రగ్స్ విక్రయించడానికి పనిలో పెట్టుకోకూడదు.
ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..
సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..
PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EzgZRf
0 Response to "మద్యం తాగడానికి వయసు సడలించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఎంత తగ్గించిందంటే..?"
Post a Comment