-->
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే..

Priyanka

బిగ్‌బిస్‌-5 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ‘టికెట్‌ టు ఫినాలే’ రేస్‌ మొదలు కావడంతో హౌస్‌లో ఎవరుంటారు? ఎవరు బయటకు వెళ్లిపోతారు? అన్న ఆసక్తి మొదలైంది. కాగా ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ గేమ్‌షోలో తాజాగా ప్రియాంకా సింగ్‌ ఎలిమినేట్‌ అయింది. దీంతో హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. గతంలో తమన్నా సింహాద్రి లాగా ప్రియాంక కూడా త్వరగానే హౌస్‌ నుంచి బయటకు వస్తుందని చాలామంది భావించారు. అందుకు తగ్గట్లే నామినేషన్స్‌లో కూడా నిలిచింది. అయితే తమన్నలా పింకీ అరిచి గోలగోల చేయలేదు. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప కంటెస్టెంట్లతో పెద్దగా గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. తనకు ఇష్టమైన కిచెన్‌ రూంలోనే గడుపుతూ హౌస్‌మేట్లకు ఇష్టమైన ఆహార పదార్థాలు వండిపెట్టింది. అదేవిధంగా ఓ ట్రాన్స్‌జెండర్‌గా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలను అందరితో పంచుకుని అభిమానుల మనసు గెల్చుకుంది. ఈ ప్రవర్తనతోనే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ చివరి దాకా చేరుకుంది ప్రియాంక.

హౌస్‌లో అందరికంటే మానస్‌తో ఎక్కువగా సన్నిహితంగా మెలిగిన పింకీ టాప్‌-5 లో ఉంటుందని చాలామంది భావించారు. కానీ 13వ వారంలో హౌస్‌ నుంచి భారంగా నిష్క్రమించింది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో అతి ఎక్కువ కాలం పాటు ఉన్న ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక ఈ షో ద్వారా ఎంత పారితోషకం అందుకుందన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… బిగ్‌బాష్‌ షో యాజమాన్యం పింకీకి వారానికి రూ. 1.75 నుంచి రూ. 2 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అంటే 13 వారాలకు గానూ మొత్తంగా సుమారు రూ. 25 లక్షల వరకు పింకీ అందుకుందని సమాచారం. షోలో తన ఫర్మామెన్స్‌ను బట్టి ఈ పారితోషకం అటూ ఇటూ ఉండవచ్చట.

Also Read:

Bigg Boss 5 Telugu: బయటకు వచ్చేసిన ప్రియాంక.. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..

Balayya Talk Show: బాలకృష్ణ టాక్‌షోలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సందడి.. ఫోటోలు వైరల్‌..!

Bigg Boss 5 Telugu: పింకీ టాప్‌ 5 లిస్టులో ఉండాల్సింది.. ఫీల్ అవుతున్న అభిమానులు.. సోషల్ మీడియాలో హల్‌చల్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3rFIGF0

0 Response to "Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel