-->
AP Employees vs Govt: ఏపీలో మరో టర్న్ తీసుకున్న పీఆర్సీ ఫైట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు.. అదేంటంటే..!

AP Employees vs Govt: ఏపీలో మరో టర్న్ తీసుకున్న పీఆర్సీ ఫైట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు.. అదేంటంటే..!

Employee

Andhra Pradesh Employees: ఏపీలో పీఆర్సీ ఫైట్ మరో టర్న్ తీసుకుంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తమ కార్యాచ‌ర‌ణపై క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ, ఇతర డిమాండ్లు నెరవేర్చుకోవడం కోసం ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి ఉద్యమ శంఖారావం పూరించనున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు నేతలు. 13 లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదని, ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో 7 పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన రాష్ట్రం ఏదీ లేదని, సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయడం సహా పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగుల నిర్ణయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also read:

ATM Charge: ఈ బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా..? వచ్చే నెల నుంచి బాదుడే.. బాదుడు..!

Online Payments: ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేవారికి గూగుల్‌ కీలక ప్రకటన.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు..!

PM Mudra Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్‌ పథకం.. ఇందులో దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షల రుణం!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lERlDY

Related Posts

0 Response to "AP Employees vs Govt: ఏపీలో మరో టర్న్ తీసుకున్న పీఆర్సీ ఫైట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు.. అదేంటంటే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel