-->
Bigg Boss 5 Telugu: హౌస్‌లో హగ్గుల జాతర.. రొమాన్స్‌తో రచ్చ చేస్తున్న సిరి-షణ్ముఖ్

Bigg Boss 5 Telugu: హౌస్‌లో హగ్గుల జాతర.. రొమాన్స్‌తో రచ్చ చేస్తున్న సిరి-షణ్ముఖ్

Siri

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అసలు ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్ధం కావడంలేదు.. రోజు రోజుకు హౌస్‌లో రచ్చ , రోమాస్స్ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సిరి , షణ్ముఖ్ మధ్య కాస్త ఎక్కువయ్యాయి. ఈ ఇద్దరి గురించి మొదటి నుంచి టాక్ నడుస్తూనే ఉంది. హౌస్ లో ఇద్దరు కలిసి ఉండటం, కలిసి ఆడటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, హగ్గులు, ముద్దులతో రచ్చ చేస్తున్నారు. టికెట్ టు ఫినాలే రెండో దశలో భాగంగా జరిగిన టాస్క్ లో మానస్ మొదటిస్థానంలో నిలిచాడు. షణ్ముఖ్ 2, సిరి 3, శ్రీరామ్ 4, ప్రియాంక 5, కాజల్ 6, సన్నీ ఏడోస్థానంలో నిలిచారు. టాప్ 3లో ఉన్నాం అంటూ సిరి షణ్ముఖ్ మరోసారి హగ్ చేసుకున్నారు. ఐస్ టాస్క్‌లో భాగంగా.. సిరికి గాయాలయ్యాయి.. ఆమెతో పాటు శ్రీరామ్ కూడా గాయాలయ్యాయి. ఇక సిరి మంచం దిగకపోవడంతో షణ్ముఖ్ ఆమెను ఎత్తుకుని తిప్పుతున్నాడు. సిరిని కాలు కిందపెట్టకుండా చూసుకుంటున్నాడు.. దానికి కృతజ్ఞతగా హగ్గుల మీద హగ్గులు ఇస్తుంది.

షణ్ముఖ్ వద్దంటున్నా.. బ్లాక్ మెయిల్ చేసి మరీ హగ్‌లు ఇస్తుంది సిరి. నువ్వురాకపోతే ట్యాబ్లేట్స్ కూడా వేసుకోను అని బెదిరిస్తోంది. దాంతో తప్పక వచ్చి హగ్ ఇచ్చాడు షణ్ముఖ్.. అయితే ఇది ఫ్రెండ్ షిప్ హగ్ మాత్రమే అని షణ్ముఖ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు.. దాంతో రెచ్చిపోయిన సిరి అతడికి ముద్దు కూడా పెట్టేసింది. కెమెరావైపు చూస్తూ షణ్ముఖ్.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అని అంటుంటే.. సిరి.. మా మమ్మీకి తెలిసిపోయి ఉంటుంది.. ఇప్పుడు అర్ధమై ఉంటుంది. వాడికి బాలేకపోయినా నన్ను బాగా చూసుకుంటున్నాడు.. నాకు తెలిసి ఇలా ఎవరూ ఉండరు అంటూ.. చెప్పుకొచ్చింది. ఈ హగ్గులు యవ్వారం చూస్తున్న ప్రేక్షకులమాత్రం .. మాకేంటిది అంటూ తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3dcNppe

0 Response to "Bigg Boss 5 Telugu: హౌస్‌లో హగ్గుల జాతర.. రొమాన్స్‌తో రచ్చ చేస్తున్న సిరి-షణ్ముఖ్"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel