
Balayya Talk Show: బాలకృష్ణ టాక్‌షోలో సూపర్ స్టార్ మహేష్‌బాబు సందడి.. ఫోటోలు వైరల్..!

Balayya Talk Show: తనలోని మరో ట్యాలెంట్‌ను బయటపెడుతూ నట సింహం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అనే షోలో వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ ప్రత్యేక టాక్‌షోకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల ‘ఆహా’ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ఓటీటీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటి ఈ షోలో మోహన్‌బాబు, నాని తదితర హీరోలు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌కు సంబంధించి సూపర్ స్టార్ మహేష్‌బాబు సందడి చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. బాలకృష్ణతో మహేష్‌బాబు సరదాగా గడిచిపోయింది. ఈ షోకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఎపిపోడ్ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది.
అయితే బాలకృష్ణ, మహేష్‌బాబు కలిసి ఓ టాక్‌షోలో కనిపించడం ఇదే తొలిసారి. వీరిద్దరి మధ్య ఫన్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ టాక్ మొదటి ఎపిసోడ్‌లో మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, ఇక రెండో ఎపిసోడ్‌లో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు.
ఇవి కూడా చదవండి:
Akhanda Movie: అఖండ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్‌లో మంటలు.. భయాందోళనతో ప్రేక్షకుల పరుగులు
N. V. Ramana : హీరోలు తెలుగు బాగా నేర్చుకుని నటిస్తే బాగుంటుంది.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Poorna New: తనదైన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటున్న ‘పూర్ణ’ శారీలో లేటెస్ట్ ఫొటోస్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3xTeLdC
0 Response to "Balayya Talk Show: బాలకృష్ణ టాక్‌షోలో సూపర్ స్టార్ మహేష్‌బాబు సందడి.. ఫోటోలు వైరల్..!"
Post a Comment