-->
YS Jagan Praja Sankalpa Yatra: రెండేళ్ల తర్వాత అవే అడుగుజాడలు.. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు

YS Jagan Praja Sankalpa Yatra: రెండేళ్ల తర్వాత అవే అడుగుజాడలు.. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు

Ys Jagan Praja Sankalpa Yatra

YS Jagan Praja Sankalpa Yatra: ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కన్నీళ్లు తుడుస్తున్న ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప యాత్ర శనివారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఇడుపుల పాయలో దిగవంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా జగన్‌ పాదయాత్ర సాగింది. అలాగే 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

క్షేత్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్‌ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగించారు. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగిస్తూ, జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే జగన్‌ విడిదిచేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు. నేను ఉన్నానంటూ.. వారికి ఎనలేని భరోసా నిచ్చారు. చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, కచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. వివక్షలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతిలేని, వివక్షలేని రీతిలో ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయి.

గ్రామ స్వరాజ్య సాధనేలో కొత్త ఒరవడి

గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యసాధనేలో కొత్త ఒరవడిని సృష్టించాయి. గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చాయి. సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ .. సేవలందించడానికి వచ్చారు. మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. గ్రామాలకు ఆస్తులు వచ్చాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌లైబ్రరీలు.. ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూర్చబడ్డాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఇవన్నీ.. ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గతొడిగినవే. ప్రజాసంకల్పయాత్రద్వారా ఇచ్చిన హామీలు, వాటిని దాదాపుగా అమలు చేయడంతో… జగన్‌ అనే పేరు విశ్వసనీయతకు మరో రూపంగా నిలబడింది. ప్రజాసంకల్పయాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.

రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మక విజయాన్ని వైయస్‌. జగన్‌ సాధించారు. నాలుగేళ్ల కిత్రం మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. అలాగే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులకు పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయాల్లో సంచనలం కలిగించారు.

సామాజిక న్యాయం చేతల్లో చూపించారు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన జగన్‌.. అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్నీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం తీసుకువచ్చారు. చట్టంగా కేంద్రం ఇంకా ఆమోదించకపోయినా.. చట్టం స్ఫూర్తిని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తున్నారు.

అయితే అధికారం చేపట్టిన రెండున్నరేళ్లు అయినా ప్రజల గుండెచప్పుడు నుంచి శ్రీ జగన్‌ ఎప్పుడూ దూరం కాలేదు. ప్రజాసంకల్పయాత్ర స్ఫూర్తి పాలనలో కొనసాగుతూనే ఉంది. అందుకే తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, కార్పొరేషన్లు, మున్సిపల్‌ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉంది. ప్రజలనాడిని, వారి గుండె చప్పుడు ప్రమాణాలుగా తీసుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యం అవుతున్నాయి. గత రెండున్నరేళ్లకాలంలోని ప్రపంచాన్ని కోవిడ్‌ వణికించినా.. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌ తనదిగా మార్చుకున్న ప్రజల గొంతుక ప్రకారమే.. సంక్షేమ పథకాల అమలు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీ నిలవగలిగింది. ఇంతటి కోవిడ్‌ విపత్తు సమయంలో కూడా ఆకలి చావుకు తావులేకుండా పరిపాలన కొనసాగింది.

‘ప్రజా సంకల్ప యాత్ర’ మరిన్ని వివరాలు:
వైయస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ వేదికగా 2017, నవంబరు 6వ తేదీన ప్రారంభమైన వైయస్‌ జగన్‌ సుదీర్ఘ ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్రమంతటా 13 జిల్లాలలో 341 రోజులు కొనసాగి, బుధవారం (జనవరి 9, 2019) నాడు ఇచ్ఛాపురంలో పూర్తయింది.

వైయస్సార్‌ జిల్లాలో..
ఇడుపులపాయలో 2017, నవంబరు 6న ప్రారంభమైన జగన్‌ ప్రజా సంకల్పయాత్ర, వైయస్సార్‌ జిల్లాలో అదే నెల 13వ తేదీ వరకు కొనసాగింది. జిల్లాలో 5 నియోజకవర్గాలలో 7 రోజుల పాటు 93.8 కి.మీ నడిచారు. 5 చోట్ల బహిరంగ సభలతో పాటు, 3 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. జిల్లాలో యాత్ర చివరి రోజున మైదుకూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.

కర్నూలు జిల్లాలో..

అదే ఏడాది నవంబరు 13వ తేదీన (యాత్ర 7వ రోజు) ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైయస్‌ జగన్‌ 18 రోజుల పాటు 263 కి.మీ నడిచారు. మొత్తం 7 నియోజకవర్గాలలో పర్యటించిన జననేత, 8 బహిరంగ సభలతో పాటు, 6 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

అనంతపురంలో..
ఆ తర్వాత 2017, డిసెంబరు 4వ తేదీన (యాత్ర 26వ రోజు) అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టిన వైయస్‌ జగన్.. 20 రోజులు పర్యటించి 9 నియోజకవర్గాలలో మొత్తం 279.4 కి.మీ నడిచారు. 10 చోట్ల బహిరంగ సభలతో పాటు, 4 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలో..

పాదయాత్రలో 46వ రోజున (2017, డిసెంబరు 28) ఎద్దులవారికోట వద్ద చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్.. 23 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించి మొత్తం 291.4 కి.మీ నడిచారు. జిల్లాలో 8 బహిరంగ సభలతో పాటు, 9 చోట్ల ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కోస్తా లోకి ప్రవేశం..
వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర 2018, జనవరి 23వ తేదీన (యాత్ర 69వ రోజున) కోస్తాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద ఆయన కోస్తాలోకి అడుగు పెట్టారు. నెల్లూరు జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో యాత్ర చేసిన జననేత 266.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 6 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో..
2018, ఫిబ్రవరి 16వ తేదీన (యాత్ర 89వ రోజు) కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలంలోని కొత్తపేట వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్, 21 రోజులు పర్యటించారు. జిల్లాలో 9 నియోజకవర్గాలలో ఆయన 278.1 కి.మీ నడిచిన ఆయన, 9 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

గుంటూరు జిల్లాలో..
మార్చి 12వ తేదీన (యాత్ర 110వ రోజు) బాపట్ల నియోజకవర్గం, అదే మండలంలోని స్టూవర్టుపురం వద్ద గుంటూరు జిల్లాలోకి అడుగు పెట్టిన వైయస్‌ జగన్.. 12 నియోజకవర్గాలలో 26 రోజులు పర్యటించారు. జిల్లాలో 281 కి.మీ నడిచిన ఆయన, 11 బహిరంగ సభలతో పాటు, 3 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో..
ఆ తర్వాత ఏప్రిల్‌ 14వ తేదీన (యాత్ర 136వ రోజు) కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. వారధి వద్దకు అశేష జనవాహిని తరలి రావడంతో ఒక దశలో ఆ వంతెన కుంగిపోతుందా? అన్నట్లుగా మారింది. దీంతో పోలీసులు వంతుల వారీగా ప్రజలను వంతెనపైకి అనుమతించారు. కృష్ణా జిల్లాలో 24 రోజుల పాటు 239 కి.మీ నడిచిన వైయస్‌ జగన్, 12 నియోజకవర్గాలలో పర్యటించారు. 10 బహిరంగ సభలు సమావేశాలు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరిలో..
మే 13వ తేదీ (యాత్ర 160వ రోజున) దెందులూరు నియోజకవర్గం, కలకర్రు వద్దపశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన వైయస్‌ జగన్, 13 నియోజకవర్గాలలో పర్యటించారు. జిల్లాలో 27 రోజుల పాటు 316.9 కి.మీ నడిచిన జననేత, 11 బహిరంగ సభలతో పాటు, 5 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

తూర్పు గోదావరిలో..

జూన్‌ 12వ తేదీ (యాత్ర 187వ రోజు)న కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి మాతకు హారతి, ప్రత్యేక పూజల అనంతరం గోదావరి రైల్‌ కమ్‌ రోడ్‌ వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్న వైయస్‌ జగన్‌ తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. జిల్లాలో సరిగ్గా రెండు నెలలు సాగిన శ్రీ వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఆగస్టు 13న ముగిసింది. జిల్లాలో 50 రోజులు పాదయాత్ర చేసిన ఆయన 17 నియోజకవర్గాలలో 412 కి.మీ నడిచారు. 15 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు, 2 చోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

విశాఖ జిల్లాలో..
గత ఏడాది ఆగస్టు 14వ తేదీ (యాత్ర 237వ రోజు)న నర్సీపట్నం నియోజకవర్గం, నాతవరం మండలంలోని గన్నవరం మెట్ట వద్ద ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 32 రోజుల పాటు, 12 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్‌ జగన్.. 277.1 కి.మీ నడిచారు. 9 సభలు, సమావేశాలతో పాటు, 2 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

విజయనగరం లో..
సెప్టెంబరు 24వ తేదీ (యాత్ర 269వ రోజు)న ఎస్‌.కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోకి అడుగు పెట్టిన వైయస్‌ జగన్‌ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. అక్టోబరు 25వ తేదీన జిల్లాలో 294వ రోజు యాత్ర పూర్తి చేసుకున్న వైయస్‌ జగన్, హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి విఐపీ లాంజ్‌లో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. దీంతో ప్రజా సంకల్పయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 17 రోజుల విరామం తర్వాత నవంబరు 12వ తేదీన యాత్ర తిరిగి మొదలైంది. విజయనగరం జిల్లాలో మొత్తం 36 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్‌ జగన్‌.. 311.5 కి.మీ నడిచారు. 9 బహిరంగ సభలతో పాటు, 2 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..
2018 నవంబరు 25వ తేదీ (యాత్ర 305వ రోజు)న పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని కడకెల్ల వద్ద వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించారు. కాగా, ఇదే జిల్లాలో యాత్ర 341వ రోజున, బుధవారం (జనవరి 9, 2019) నాడు ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తోంది. జిల్లాలో మొత్తం 37 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్‌ జగన్‌ 338.3 కి.మీ నడిచారు. 10 చోట్ల బహిరంగ సభలతో 6 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.

ప్రజా సంకల్ప యాత్ర విశేషాలు
► మొత్తం రోజులు 341
► 13 జిల్లాలు
► నియోజకవర్గాలు 134
► 231 మండలాలు
► 2516 గ్రామాలు
► 54 మున్సిపాలిటీలు
► 8 కార్పొరేషన్లలో పాదయాత్ర
► 124 సభలు, సమావేశాలు
► 55 ఆత్మీయ సమ్మేళనాలు
► 3648 కి.మీ నడక

ప్రారంభం: నవంబరు 6, 2017 ఇడుపులపాయ.
ముగింపు: జనవరి 9, 2019 ఇచ్ఛాపురం.
14 నెలలు
ఇలా ప్రజల కోసం పరితపించిన వైఎస్‌ జగన్‌.. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి గుండెల్లో దేవుడిలా ఉండిపోయారు. ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రశంసలు అందుకుంటున్నారు. సామాన్య జనానికి న్యాయం జరిగేలా, ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. అధికారులను సైతం ఉరుకులు పరుగులు పెట్టించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. జనం గుండె చప్పుడు స్వయంగా విన్న వైఎస్‌ జగన్‌.. క్షేత్ర స్థాయిలో సమస్యలను గురించి, ప్రభుత్వ సారథిగా వాటిని పరిష్కరించారు.

ఇవి కూడా చదవండి:

విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్

Andhra Pradesh: ఉద్యోగుల హాజ‌రుపై ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న ఆదేశాలు.. ఆ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qaKSnl

0 Response to "YS Jagan Praja Sankalpa Yatra: రెండేళ్ల తర్వాత అవే అడుగుజాడలు.. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel