
Sugar Price: అక్కడ పెట్రోల్ కంటే చక్కెర ధర రికార్డ్ స్థాయిలో.. కిలో పంచదార రూ.150

Sugar Price: ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్‌ధరలు పరుగులు పెడుతుంటే.. నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక పాకిస్థాన్‌లో ధరలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొరుగు దేశమైన పాక్‌లో చక్కెర ధర పెట్రోల్ రేటుకంటే మించిపోతోంది. నివేదికల ప్రకారం.. పాక్ దేశంలోని నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ వివిధ నగరాల్లో చక్కెర కిలో రూ.150 వరకు పలుకుతోంది. కాగా, ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.138.30 ఉంది. వృత్తిరీత్యా హోల్‌సేల్ మార్కెట్ల్‌లో కిలో ధర రూ.8 పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. షుగర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. చక్కెర కిలో రూ.140కి విక్రయిస్తున్నారని, చిల్లరగా కిలో రూ.145 నుంచి రూ.150కి పెరిగిందన్నారు.
ధర పెరగడానికి కారణాలేమిటి..?
కాగా, లాహోర్‌లో హోల్‌సేల్ మార్కెట్‌లో చక్కెర ధర గురువారం కిలో రూ.126 ఉంది. అలాగే చక్కెర డీలర్లు లాభాలు ఆర్జించేందుకు కృత్రిమ నిల్వలను సృష్టించి అక్రమంగా ధరలను పెంచారని నివేదిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కరాచీలో చక్కెర ఎక్స్-మిల్ ధర ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నగరంలో కిలో చక్కెర ధర రూ.142 లభిస్తోంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే రూ.12కు పెరిగింది.
ఇమ్రాఖాన్ సబ్సిడీ ప్యాకేజీ..
పాక్ ప్రధాని ఇమ్రాఖాన్ బుధవారం రూ.120 బిలియన్ల సబ్సిడీ ప్యాకేజీని ప్రకటించారు. అతను దీనిని ఇప్పటి వరకు దేశంలో సబ్సిడీ ప్యాకేజీ అని పిలిచారు. ఇందులో ద్రవ్యోల్బణం నుంచి రూ.130 మిలియన్ల ప్రజలను మేలు చేసేందుకు నెయ్యి, పిండి, పప్పులపై 30 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే, అక్రమంగా లాభాలు పొందేందుకు డీలర్లే కృత్రిమ కొరతను సృష్టించి ఒక్కసారిగా రేట్లు పెంచారని ఆరోపణలున్నాయి. ఇక భారతదేశంలో కూడా చక్కెర ధర పెరిగింది. గత మూడు నెలలలో దేశంలో చక్కెర ధర కిలో రూ.5 మేర పెరిగింది.
ఇవి కూడా చదవండి:
Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్.. ఎలాగంటే..
GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CSac51
0 Response to "Sugar Price: అక్కడ పెట్రోల్ కంటే చక్కెర ధర రికార్డ్ స్థాయిలో.. కిలో పంచదార రూ.150"
Post a Comment