-->
Woman Auto Driver: పరిస్థితులు ఆమె తలరాతనే మార్చేశాయి.. ఆటో డ్రైవర్‌గా మారిన యువతి..

Woman Auto Driver: పరిస్థితులు ఆమె తలరాతనే మార్చేశాయి.. ఆటో డ్రైవర్‌గా మారిన యువతి..

Auto Driver

Woman Auto Driver: ఆమె ఏమైనా చేయగలదు. ఆర్థిక బాధల నుంచి గట్టెక్కాలి. తండ్రికి దూరమైనా ధైర్యం కోల్పోలేదు..ఉపాధి లేదన్న నిరాశకు గురికాలేదు.. ఆడపిల్ల గడప దాటితే రక్షణ లేదన్న వారికి తాను సమాధానం కావాలి. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటే ఇదేనేమో. గరిటె పట్టాల్సిన చేతులు స్టీరింగ్ పట్టాయి. ఆటోవాలాగా మారి కుటుంబ బాధ్యత తీసుకున్న ఆ యువతి..రెండేళ్లుగా అదే వృత్థిలో కొనసాగుతూ చదువుకుంటోంది. ఆటో ఉషారాణిగా స్థానికంగా గుర్తింపు తెచ్చుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఆర్బీ నగర్‌కు చెందిన ఉషారాణి స్థానిక ప్రైవేట్ డిగ్రీ కలశాలలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది..తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది..ఇంటికి మగదిక్కుగా నిలిచింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా కాలేజీ తర్వాత ఆటో నడిపిస్తుంది.. వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్న ఈ ఆటో ఉషారాణి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది..

తన తండ్రి అకాల మరణం నాటి నుంచి ఉపాధి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అందుకే తాను డ్రైవర్‌గా మారాల్సి వచ్చిందని, ఆటో నడిపి తన కుటుంబాన్ని పోషిస్తున్నానంటూ.. గ‌ర్వంగా చెబుతున్నారు ఆటో ఉషారాణి..ఓ మ‌హిళ డ్రైవింగ్ ఫీల్డ్‌లోకి రావడాన్ని వివిధ రకాలుగా చర్చిస్తుంది సమాజం. అయినా అవేమీ పట్టించుకోకుండా ఉషారాణి మనో ధైర్యంతో ముందుకెళ్లారని చెబుతున్నారు స్థానికులు. దాతలేవరైనా ఉషారాణి కి స‌హాయం చేయాల‌ని కోరుతున్నారు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nP510r

0 Response to "Woman Auto Driver: పరిస్థితులు ఆమె తలరాతనే మార్చేశాయి.. ఆటో డ్రైవర్‌గా మారిన యువతి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel