-->
Viral News: అప్పుడే పుట్టిన బిడ్డ కోసం తల్లి గేదె పరుగులు.. ఆగకుండా 3 కిలోమీటర్లు..

Viral News: అప్పుడే పుట్టిన బిడ్డ కోసం తల్లి గేదె పరుగులు.. ఆగకుండా 3 కిలోమీటర్లు..

Buffalo

Viral News: అమ్మ ప్రేమ, త్యాగానికి వెలకట్టలేం, నిర్వచనం కూడా చెప్పేందుకు మాటలు చాలవు..అది మనుషులైనా, జంతువులనే కదా..ఏ జీవుల్లోనైనా తల్లి ప్రేమ ఒక్కటే..తల్లికి ఎంత ప్రమాదం జరిగిననా, తన బిడ్డల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది..ఇక ప్రమాదంలో వున్న తన బిడ్డను కాపాడుకోవడానికి, ఆ తల్లి తన బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా సరే వెళుతుంది.. ఎంత పెద్ద ప్రమాదాన్ని అయినా ఎదుర్కొంటుంది. చెన్నైలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు చూస్తే ఎంతటి వారైన సరే..భావోద్వేగానికి గురికాక తప్పదు..

చెన్నై పోరూర్ కు చెందిన ఓ వ్యక్తి పశువుల్ని పెంచుతూ పాల వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలానే తన పశువులను మేత కోసం బయటకు తీసుకెళ్లాడు..అక్కడే గేదె ఈనింది. బుల్లి దూడ బయటకు వచ్చింది. ఆ బుజ్జి దూడను ఎత్తుకుని బైక్‌ మీద ఇంటికి బయలుదేరారు. అనూహ్యంగా అప్పటివరకు మామూలుగానే ఉన్న తల్లి గేదె.. తన బిడ్డను ఎక్కడికో తీసుకెళుతున్నారన్న ఆందోళనతో.. బండి వెనుక పరుగులు తీసింది. దాదాపు మూడు కి.మీ. పాటు అలానే యజమాని వాహనంతో పాటు పరుగులు తీసింది. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఘటన మరోమారు వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తల్లి ప్రేమను నిర్వచిస్తూ…కామెంట్ల వర్షం కుమ్మరిస్తున్నారు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nRswpT

Related Posts

0 Response to "Viral News: అప్పుడే పుట్టిన బిడ్డ కోసం తల్లి గేదె పరుగులు.. ఆగకుండా 3 కిలోమీటర్లు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel