-->
Online Business: కుక్కలా నటిస్తూ సంవత్సరంలో 7 కోట్లు సంపాదించింది.. అదెలా సాధ్యమైందంటే..

Online Business: కుక్కలా నటిస్తూ సంవత్సరంలో 7 కోట్లు సంపాదించింది.. అదెలా సాధ్యమైందంటే..

Dog Barking

Online Business: ప్రస్తుత కాలంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. యూట్యూబ్ నుండి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వరకు ఇలా అనేక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలు డబ్బును ఆర్జిస్తున్నారు. డబ్బు సంపాదనకు ఇవే కాకుండా చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వ్యక్తులు ఇంట్లో కూర్చొనే డబ్బు సంపాదించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా.. ఓన్లీఫ్యాన్స్ అనే వెబ్‌సైట్ విదేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ సైట్‌లో అడల్ట్ కంటెంట్ చాలా షేర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు. వాటిని చూసేందుకు జనాలు డబ్బులు చెల్లిస్తుంటారు. అయితే, జెన్నా అనే ఓ మహిళ ఈ సైట్ ద్వారా సంవత్సరంలో ఏడు కోట్లు సంపాదించింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆమె కేవలం కుక్కలా ప్రవర్తించడం ద్వారానే ఏడు కోట్లు సంపాదించింది. కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి ప్రజలను ఆకట్టుకునే కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా.. పాపులర్ అయ్యింది.

కేవలం కుక్కలా ప్రవరిస్తూనే కోట్లు సంపాదిస్తోంది. చాలా మంది ప్రజలు తమ కోరికలో భాగంగా కుక్కలా నటించాలంటూ అడుగుతారని, వారు చెప్పినట్లుగా చేస్తే భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్నా చెప్పుకొచ్చింది. కుక్కలా నటించడం, నాలుగు కాళ్లపై నడవడం, మొరగడం వంటివి చేస్తే యూజర్లు తనకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని తెలిపింది.

ఇలా చేస్తున్నందుకు చాలామంది తనను నిందించారంది జెన్నా. అయితే, వారి మాటలను తాను అస్సలు పట్టించుకోలేదని తెలిపింది. టైమ్‌పాస్ కోసం ఓన్లీ ఫ్యాన్స్ సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేశానన్న జెన్నా.. లాక్‌డౌన్ సమయంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు సరదాగా వీడియోలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానంది. మొదట్లో ఐస్ క్రీమ్స్ తింటూ వీడియో పెట్టగా.. పలువురు కుక్క భంగిమలో నటించాలంటూ కోరారంది. అలా కుక్కను అనుకరిస్తూ ఆమె చేసిన నటన.. అందరినీ ఆకట్టుకుంది. అలాంటి వీడియోలనే యూజర్లు కోరుతుండటం.. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుండటంతో జెన్నా అప్పటి నుంచి కుక్కలాగే నటిస్తూ వస్తోంది. గత సంవత్సరం జూన్ నుంచి సదరు వెబ్‌సైట్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించగా.. ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే 7 కోట్లు సంపాదించింది జెన్నా.

అయితే, తన ఫాలోవర్స్ సంఖ్య పెంచడానికి జెన్నా చాలానే కష్టపడింది. సోషల్ మీడియాను విపరీతంగా వాడేసుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌లో చిన్న చిన్న క్లిప్‌లు పెట్టి ప్రజలను తనవైపు ఆకర్షించింది. ఆ వెంటనే ఆ వీడియోలను తొలగించేది. అలా జనాలను తనవైపు తిప్పుకునేది జెనా. అయితే, అడల్ట్ కంటెంట్ జనరేటర్ జెనాపై చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. కానీ, వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇంకా మరింత ఇష్టంగా చేస్తూ వవ్తోంది.

Also read:

Shocking News: బాటిల్‌లో ఇరుక్కుపోయిన ప్రైవేట్ పార్ట్.. 2 నెలల తరువాత డాక్టర్‌కి చూపిస్తే కట్ చేసి పారేశారు..!

Viral News: వీడెవడో గానీ నిజంగా ఉత్తమ దొంగే.. పూలకుండీని దొంగించాడు.. ఆపై ఓ లెటర్ రాసి, డబ్బులు పెట్టి..

Viral Photos: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చెట్టు ఇదే..! తాకితే చాలు ప్రాణాలు పోతాయ్‌..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3uAheb5

0 Response to "Online Business: కుక్కలా నటిస్తూ సంవత్సరంలో 7 కోట్లు సంపాదించింది.. అదెలా సాధ్యమైందంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel