Winter: శీతాకాలంలో అందమైన ప్రదేశాలను చూడాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!

Winter Vacations: చాలా మంది ప్రజలు వింటర్ సీజన్ కోసం వేచి ఉంటారు. ఎందుకంటే వీరు మంచు ప్రదేశాల్లో తిరగడం చాలా ఎంజాయ్ చేస్తారు. శీతాకాలపు సెలవులు విశ్రాంతి తీసుకోవడానికి, కొత్త శక్తిని ఇవ్వడానికి మంచి సమయం. ఈ సమయంలో మీరు సందర్శించడానికి ఒక టూర్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. భారతదేశంలో మీరు సందర్శించగల అనేక ప్రదేశాలు ఉన్నాయి. మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ అందమైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా మీరు శీతాకాలాన్ని ఆస్వాదించవచ్చు. ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
1. గుల్మార్గ్
గుల్మార్గ్ భారతదేశంలోని ఉత్తర రాష్ట్రమైన కశ్మీర్‌లో ఉన్న ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. అందమైన మంచు కారణంగా శీతాకాలంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. గుల్‌మార్గ్‌లోని మంచుతో నిండిన దృశ్యాలు అందంగా కనిపిస్తాయి. సాహస ప్రియులు ఇక్కడ ట్రెక్కింగ్‌ను ఆనందిస్తారు.
2. సిమ్లా
మంచు కురిసే శీతాకాలంలో సిమ్లా, కుఫ్రీ చాలా అందంగా కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా చుట్టూ కొండలు, మంచుతో కప్పబడిన అడవులు ఉంటాయి. ఇవి నగరాన్ని అందంగా చూపిస్తాయి. మాల్ రోడ్‌లో అనేక రెస్టారెంట్‌లు ఉంటాయి. అందమైన హిమాలయాల విశాల దృశ్యాలను ఆస్వాదించడానికి ఇది ఒక మంచి ప్రదేశం.
3. వాయనాడ్
చలికాలంలో మీకు చల్లని హిల్ స్టేషన్‌లు నచ్చకపోతే మీరు కేరళలో ఉన్న అందమైన దక్షిణ నగరం వయనాడ్‌ని సందర్శించవచ్చు. ఇక్కడి ఆహారం, సంస్కృతి, చరిత్ర మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వయనాడ్ సంవత్సరం పొడవునా దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది.
4. డల్హౌసీ
హిమాచల్‌లోని మరో అందమైన హిల్ స్టేషన్ డల్హౌసీ. శీతాకాలంలో సందర్శించడానికి డల్హౌసీ ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.
5. గోవా
గోవా ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది సందర్శించడానికి మంచి ప్రదేశం. ఈ సమయంలో ఈ స్థలాన్ని సందర్శించడం ద్వారా మీ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి. ఆహ్లాదకరమైన వాతావరణం, నిర్మలమైన బీచ్‌లు, నైట్‌క్లబ్‌లు, వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్, పార్టీలను ఆస్వాదించండి.
IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?
Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్ నిబంధనలు తప్పనిసరి..
weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్ ట్రెండ్స్ ఇవే..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nfRTkO


0 Response to "Winter: శీతాకాలంలో అందమైన ప్రదేశాలను చూడాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!"
Post a Comment