
ఆస్తి పత్రాలు పోగొట్టుకున్నారా.. అయితే డూప్లికేట్ డాక్యుమెంట్లు ఎలా పొందాలో తెలుసుకోండి..

Property Document: మీరు ఆస్తికి యజమాని అయితే దాని పత్రాలు ఎంత విలువైనవో తెలుస్తుంది. కొంతమంది ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచడానికి బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఆ ఆస్తులకు యజమాని మీరే అని చూపించే పత్రాలు ఇవి మాత్రమే. ఇవి లేకుంటే భవిష్యత్తులో మీరు క్రయ విక్రయాలు చేయలేరు. ఒకవేళ ఇలాంటి ఆస్తి పత్రాలను మీరు పోగొట్టుకుంటే ఏం చేయాలి. ఈ పరిస్థితి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఎందుకంటే ఆస్తి పత్రాలు లేకుంటే క్రయ విక్రయాలు జరుగవు. అంతేకాదు బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకోలేరు. అందువల్ల మీరు తక్షణమే కొన్ని చర్యలు తీసుకుని డూప్లికేట్ డాక్యుమెంట్లను తయారు చేసుకోవాలి. అది ఎలాగో తెలుసుకుందాం.
1. FIR ఫైల్ చేయాలి.
కాగితాలు పోయినట్లు లేదా దొంగిలించారని తెలిసిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌లో పేపర్లు పోయాయన్న కాపీని మీ వద్ద ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ కాపీ భవిష్యత్‌లో మీకు ఉపయోగపడుతుంది.
2. వార్తాపత్రికలో నోటీసును ముద్రించండి
తదుపరి దశలో మీరు వార్తాపత్రికలో తప్పిపోయిన కాగితం గురించి నోటీస్ ఇవ్వండి. ఇది ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటీసు అవుతుంది. తదుపరి 15 రోజులు వేచి ఉండండి ఎందుకంటే ఎవరైనా పేపర్‌లను పొంది ఉండవచ్చు ఆ సమయంలో దానిని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నోటీసు ఆంగ్ల వార్తాపత్రిక, ప్రాంతీయ వార్తాపత్రిక రెండింటిలోనూ ప్రచురించాలి.
3. డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ పొందండి
4. చట్టపరమైన మార్గాన్ని అనుసరించండి
ప్రాపర్టీ పేపర్ కోసం స్టాంప్ పేపర్‌పై చేసిన అండర్‌టేకింగ్‌ను పొందాలి. దీనిలో ఆస్తి గురించి పూర్తి సమాచారం ఉంటుంది. అందులో తప్పిపోయిన పేపర్లు, ఎఫ్‌ఐఆర్, వార్తాపత్రిక నోటీసులను పేర్కొనాలి. నోటరీ ద్వారా ఆమోదించి ఆపై రిజిస్ట్రార్ కార్యాలయానికి సమర్పించాలి.
5. డూప్లికేట్ ప్రాపర్టీ పేపర్‌లను పొందండి
Baca Juga
weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్ ట్రెండ్స్ ఇవే..!
Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్ నిబంధనలు తప్పనిసరి..
IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/329YCVv
0 Response to "ఆస్తి పత్రాలు పోగొట్టుకున్నారా.. అయితే డూప్లికేట్ డాక్యుమెంట్లు ఎలా పొందాలో తెలుసుకోండి.."
Post a Comment