
Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. త్రీటౌన్ సీఐ మృతి.. పెట్రోలింగ్ చేసి..

Visakhapatnam Road Accident: ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎండాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. త్రీటౌన్ సీఐ కరణం ఈశ్వరరావు నైట్ పెట్రోలింగ్‌ను ముగించుకొని ఇంటికి వెళుతుండగా.. పోలీస్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ సంతోష్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సీఐకు తలకు బలంగా తగలండంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఐ ఈశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గుర్తుతెలియని వాహనం కోసం.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also Read:
Crime News: దారుణాతి దారుణం.. పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం.. ఆపై..
Bizarre Incident: ఆ డీజే సౌండ్‌తో నా కోళ్లు చచ్చాయి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oSa8w4
0 Response to "Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. త్రీటౌన్ సీఐ మృతి.. పెట్రోలింగ్ చేసి.."
Post a Comment