
Earthquake in Chittoor: చిత్తూరు జిల్లా రామకుప్పంలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనాలు..

Earthquake in Chittoor: చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. రామకుప్పం మండలంలోని గడ్డూరు, గిరిగేపల్లి, యానాదికాలనీ గ్రామాల్లో రాత్రి ఉన్నట్లుండి భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దాంతో ఇళ్లలో జనాలు ఒక్కసారిగా హడలిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అందరూ ఒకచోట గుమిగూడి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వీధుల్లో నిల్చున్నారు. కాగా, భూ ప్రకంపన కారణంగా.. ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు.. స్వల్ప భూ ప్రకంపనలే అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FOJ8o6
0 Response to "Earthquake in Chittoor: చిత్తూరు జిల్లా రామకుప్పంలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనాలు.."
Post a Comment