-->
Ravinder Singh: కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు.. కారణం అదేనా..?

Ravinder Singh: కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు.. కారణం అదేనా..?

Karimnagar Ex Mayor Ravinder Singh

Karimnagar ex Mayor Ravinder Singh: కరీంనగర్‌ మాజీ మేయర్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రవీంద్ర సింగ్. అయితే, ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్‌ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. రవీందర్‌ సింగ్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్‌లో బరిలోకి దిగారు. మీడియా సమావేశంలో ఓటర్లు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి తీసుకున్నా.. ఓటు మాత్రం తనకే వేయాలని రవీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించడంపై ఎంపీడీవోకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు రవీందర్‌సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రవీంద్ర సింగ్ కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించిన రవీంద్రసింగ్ పార్టీ నుంచి అనుమతి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్ఎస్ తరఫున ఎల్‌. రమణ, టి.భాను ప్రసాద్‌రావును పార్టీ బరిలోకి దించింది. దీంతో తనకు టికెట్‌ రాకపోవడంతో రవీందర్‌సింగ్‌ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

Read Also… Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ మరణం బాధాకరమన్న సోము వీర్రాజు.. డ్యాన్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ అంటూ సంతాపం తెలిపిన లోకేష్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3p1PpWU

Related Posts

0 Response to "Ravinder Singh: కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌పై కేసు నమోదు.. కారణం అదేనా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel